Banking News: ఆ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 4 నుంచి కొత్త నిబంధనలు.. అలా చేయకపోతే చెక్కులు చెల్లవు

|

Feb 28, 2022 | 11:15 AM

Banking News: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో చెక్కుల చెల్లింపు నిబంధనలు మారనున్నాయి. ఏప్రిల్ 4, 2022 నుండి అమలులోకి వచ్చేలా చెక్ చెల్లింపు కోసం బ్యాంక్ '..

Banking News: ఆ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 4 నుంచి కొత్త నిబంధనలు.. అలా చేయకపోతే చెక్కులు చెల్లవు
Follow us on

Banking News: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో చెక్కుల చెల్లింపు నిబంధనలు మారనున్నాయి. ఏప్రిల్ 4, 2022 నుండి అమలులోకి వచ్చేలా చెక్ చెల్లింపు కోసం బ్యాంక్  పాజిటివ్ పే సిస్టమ్ (Positive Pay System) నియమాలను మారుస్తోంది . ఈ కొత్త నిబంధన ప్రకారం.. మీరు చెక్కు (Cheque) ద్వారా రూ. 10,00,000 లేదా అంతకంటే ఎక్కువ చెల్లిస్తే అందుకు సంబంధించిన ధృవీకరణ తప్పనిసరి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. చెల్లింపు సమయంలో మోసం జరగకుండా చెక్ జారీ చేసేవారికి ఇది సహాయం చేస్తుంది. ఈ మేరకు పీఎన్‌బీ ట్వీట్‌ చేసింది . PNB ఒక ట్వీట్‌లో.. వివిధ రకాల చెక్కు మోసాల నుండి రక్షిస్తుంది. ఖాతాదారులు చెక్కు వివరాలను శాఖలో లేదా డిజిటల్ మార్గాల ద్వారా డిపాజిట్ చేయవచ్చు.

చెక్కు ద్వారా రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నట్లయితే తప్పనిసరి ముందస్తుగా వివరాలు బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలు నేరుగా గానీ, డిజిటల్‌ మోడ్‌లోగానీ అందించవచ్చు. ఇది 4 ఏప్రిల్ 2022 నుండి అమల్లోకి వస్తుందని సదరు బ్యాంకు తెలిపింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కస్టమర్‌లు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా టోల్ ఫ్రీ నంబర్‌లకు 18001802222 లేదా 18001032222 కాల్ చేయడం ద్వారా మరింత సమాచారాన్ని పొందవచ్చు.

ఈ వివరాలు అవసరం:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ పాజిటివ్ పే సిస్టమ్ కోసం కస్టమర్‌లు తమ ఖాతా నంబర్, చెక్ నంబర్, చెక్ ఆల్ఫా, చెక్ తేదీ, చెక్ అమౌంట్, లబ్ధిదారుడి పేరు మొదలైనవాటిని బ్యాంక్‌కి అందించాలి. ఈ ఒక వేళ ఈ వివరాలు ముందస్తుగా అందించనట్లయితే చెక్కు చెల్లదు. మీ చెక్కు తిరిగి వస్తుంది. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు ముందు నిర్ధారణ NPCLకి పంపబడుతుంది మరియు తదుపరి క్లియరింగ్ సెషన్‌కు ఉంటుంది. అన్ని తదుపరి నిర్ధారణలు తదుపరి క్లియరింగ్ సెషన్‌లో పరిష్కరించబడతాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వ్యవస్థ ద్వారా మోసాలను నివారించవచ్చు. ఈ విధానంలో అధిక మొత్తంలో లావాదేవీలు జరిపే ఖాతాదారులు తమ చెక్కులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బ్యాంకుకు అందించాలి. దీని తర్వాత ఈ చెక్కుల చెల్లింపును క్లియర్ చేస్తున్నప్పుడు ఈ వివరాలు సరిపోలాయి. ఒక వేళ మీరు అందించిన వివరాల సరిపోలని పక్షంలో చెల్లింపు నిలిపివేయబడుతుంది. పాజిటివ్ పే సిస్టమ్ కింద చెక్ ధృవీకరించబడిన తర్వాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు రిఫరెన్స్ నంబర్ పంపబడుతుంది. ఒక వేళ మీరు చెక్‌ జారీ చేసిన తర్వాత అది 3 నెలలు దాటినట్లయితే ఈ సిస్టమ్‌లో అంగీకరించబడదు. పాజిటివ్ పే సిస్టమ్‌ను ఉపయోగించడానికి కస్టమర్ మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ సమయంలో MPIN, పాస్‌వర్డ్ మొదలైనవాటిని నమోదు చేయాలి. బ్యాంక్‌ చెక్‌ విషయంలో మోసాలు జరుగుతున్నందున ఈ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.

 

ఇవి కూడా చదవండి:

Post Office: పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి లాభాలు..!

Bank Holidays: మార్చి నెలలో బ్యాంకులకు 13 రోజుల సెలవులు.. ఏయే రోజు అంటే..!