Bank Loan: ఆ బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక చౌకగా రుణాలు..!

Bank Loan: ప్రస్తుతం బ్యాంకులు సులభతరంగా రుణాలను అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే వ్యక్తిగత, హోమ్‌, ఇతర రుణాలను..

Bank Loan: ఆ బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక చౌకగా రుణాలు..!
Follow us

|

Updated on: Jan 17, 2022 | 6:12 AM

Bank Loan: ప్రస్తుతం బ్యాంకులు సులభతరంగా రుణాలను అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే వ్యక్తిగత, హోమ్‌, ఇతర రుణాలను అందజేస్తున్నాయి. ఇక గృహ రుణాలు, ఆటోలోన్‌, విద్య కోసం రుణాలు తీసుకునేవారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది పంజాబ్ సింధ్‌ బ్యాంకు. మార్జినల్‌ కాస్ట్‌ బేస్ట్‌ లెండింగ్‌ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకు ఎంసీఎల్‌ఆరర్‌ను 5 నుంచి 10 బేసిక్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కొత్త రేట్లు జనవరి 16 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది. వ్యక్తిగత రుణాలు, ఆటో, గృహ రుణాల మార్జినల్‌ కాస్ట్‌ బేస్ట్‌ లెండింగ్‌ రేటుకు అనుగుణంగా జారీ చేస్తారు. ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆ్‌ 7.45 శాతంగా ఉంటుందని తెలిపింది.

వడ్డీ రేట్లు తగ్గింపు:

అలాగే నెల, మూడు నెలలు, ఆరు నెలలు కాల వ్యవధి గల ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లను కూడా బ్యాంకు తగ్గించింది. అయితే ప్రస్తుత బేస్‌ రేటుపై మాత్రం బ్యాంకు ఎలాంటి తగ్గింపులు చేయలేదు.

ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి?

ఎంసీఎల్‌ఆర్‌ (MCLR-Marginal Cost of Funds Based Lending Rate -మార్జినల్‌ కాస్ట్‌ బేస్‌డ్‌ లెండింగ్‌ రేటు) అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ విధానాన్ని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తీసుకువచ్చింది. బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి ఎంసీఎల్ఆర్ విధానాన్ని ఆర్బీఐ అమల్లోకి తీసుకువచ్చింది. అంతకు ముందు అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఒక వడ్డీ రేటును నిర్ణయించేవి. బేస్‌ రేటు స్థానంలో ఎంసీఎల్‌ఆర్‌ను ఏప్రిల్‌ 2016 నుంచి బ్యాంకులు అమలు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Budget 2022: కేంద్రం బ‌డ్జెట్‌ను ఎలా త‌యారు చేస్తుంది…? ఎలాంటి కసరత్తు ఉంటుంది..? ఎన్నో ఆసక్తికరమైన విషయాలు

EV Charging Stations: ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు సులభతరం.. ప్రభుత్వం నిబంధనలు మార్చింది..!