PSB Loan: కేవలం 59 నిమిషాల్లోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) నుంచి రుణాలు భారీగా మంజూరు అవుతున్నాయి. పోర్టల్ సేవలు రిటైల్ రుణాలకు విస్తరించడం జరిగింది. హోమ్ లోన్, వ్యక్తిగత రుణం, ఆటో రుణాలకు సంబంధించి రుణాలు మంజూరు అవుతున్నాయి. ఈ పథకాన్ని కేంద్రం 25 సెప్టెంబర్ 2018లో ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి 28 ఫిబ్రవరి 2022 వరకు పోర్టల్‌లో 2,01,863 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో వ్యాపార విభాగంలో రూ.39,580 కోట్ల రుణాలు మంజూరైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్‌రావ్ కరాద్ మంగళవారం రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. పోర్టల్‌లో రుణాల మంజూరు వేగవంతంగా జరుగుతోందని, అన్ని వర్గాల వారికి ఆర్థికంగా మేలు జరిగే విధంగా చర్యలు చేపడుతోందని అన్నారు. అలాగే ఈ పోర్టల్‌లో రిటైల్ లోన్ కేటగిరిలో సుమారు 17,791 దరఖాస్తులు రాగా, రూ.1,689 కోట్ల మేర రుణాలను అందించినట్లు మంత్రి వెల్లడించారు. లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత రుణం ఇచ్చేందుకు తుది నిర్ణయం రుణదాతలు తీసుకుంటారని, రుణం మంజూరుకు సంబంధించి బ్యాంకు అకౌంట్లను పర్యవేక్షిస్తారన్నారు.
ఎంఎస్‌ఎంఈలకు కోటి రూపాయల వరకూ ఈ పోర్టల్ ద్వారా రుణం పొందే సదుపాయం ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ నుంచి బ్యాంక్ అకౌంట్ల వరకూ అందుబాటులోఉన్న పలు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను పరిశీలనలోకి తీసుకుని వచ్చే డేటా పాయింట్లను అత్యుధునిక ఆల్గోరిథమ్స్ ద్వారా విశ్లేషించి తక్షణ రుణ లభ్యత కల్పించడం ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశమని మంత్రి వెల్లడించారు. పోర్టల్ ద్వారా ఒక MSME కనిష్టంగా రూ.1 నుంచి గరిష్టంగా రూ.5 కోట్ల వరకు పోస్ట్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వరకు వ్యాపార రుణాన్ని పొందవచ్చన్నారు. అయితే రుణం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కస్టమర్‌కు సంబంధించిన అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే రుణం ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాయని అన్నారు.
ఇవి కూడా చదవండి: