డబ్బు సంపాదించే ప్రతీ ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత ఆదా చేయాలనే భావనలో ఉంటారు. వారి, వారి ఆదాయాలు, ఖర్చులకు అనుగుణంగా ఎంతో కొంత పొదుపు చేస్తుంటారు. ఇందుకోసం ఎన్నో రకాల మార్గాలను అన్వేషిస్తుంటారు.
రూపాయి రూపాయి కూడబెట్టిన మొత్తాన్ని సురక్షితంగా ఉండాలని భావిస్తుంటారు. తమ డబ్బుకు సెక్యూరిటీతో పాటు మంచి రాబడి కూడా రావాలని భావిస్తుంటారు. అలాంటి మార్గాల్లోనే పెట్టుబడి పెట్టాలని ఆశిస్తుంటారు. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం పలు రకాల సేవింగ్స్ స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటీజన్ల కోసం కొన్ని రకాల స్కీమ్స్‌ను ప్రవేశ పెట్టాయి. తాజా గణంకాల ప్రకారం ఈ పథకాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. గత ఏప్రిల్-సెప్టెంబర్ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడలు పెట్టిన వారి సంఖ్య భారీగా పెరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి.
ఏప్రిల్-సెప్టెంబర్ సమయంలో సీనియర్ సిటీజన్ల కోసం అమలు చేస్తున్న పథకాల్లో భారీగా పెట్టుబడులు పెరిగాయి. అలాగే మహిళలు నిర్వహిస్తున్న చిన్న పొదుపు పథకాల్లో కూడా గణనీయంగా పెట్టుబడులు పెరిగినట్లు గణంకాలు చెబుతున్నారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకాల డిపాజిట్లు ఏడాది ప్రాతిపదికన దాదాపు 2.5 రెట్లు పెరిగి రూ. 74,625 కోట్లు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే.. మొత్తం పెట్టుబడిలో రూ. 28,715 కోట్లు పెరుగుదల నమోదుకావడం విశేషం. అంటే ఏకంగా 160 శాతానికి పైగా పెరిగాయి.
ఇదిలా ఉంటే సీనియర్ సిటీజన్లకు సంబంధించిన పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. సీనియర్ సిటీజన్స్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు జూన్ త్రైమాసికంలో 8 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది. వీటితోపాటు రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో కూడా 20 బేసిస్ పాయింట్ల పెరుగుదల కనిపించింది. ఇక మహిళల కోసం నిర్వహిస్తున్న.. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకంలో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 13,512 కోట్లు పెట్టుబడులు పెరిగాయి.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ విషయానికొస్తే ఇందులో.. మహిళలు రెండేళ్లపాటు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తారు. 2 ఏళ్ల మెచ్యూరిటీ ఉన్న ఈ పథకానికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ స్కీమ్‌లో పెట్టుబడులు పెడుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ పథకంలో పెట్టుబడి కనీసం రూ. 1000తో ప్రారంభించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..