Smart Phones: సామాన్యులకు ఊరట.. త్వరలో తగ్గనున్న స్మార్ట్‌ఫోన్, టీవీల ధరలు.. రీజన్ ఇదే..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్, టీవీల విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. దీంతో వాటి ధరలు త్వరలో తగ్గే అవకాశముందని తెలుస్తోంది. ఇది సామాన్యులకు బిగ్ రిలీఫ్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే టీవీలు, స్మార్ట్‌ఫోన్లు సామాన్యులందరూ ఉపయోగిస్తూ ఉంటారు.

Smart Phones: సామాన్యులకు ఊరట.. త్వరలో తగ్గనున్న స్మార్ట్‌ఫోన్, టీవీల ధరలు.. రీజన్ ఇదే..
Smartphone

Updated on: Feb 02, 2026 | 8:25 AM

బడ్జెట్ 2026లో దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే ప్రకటన చేసింది. టీవీలు, స్మార్ట్‌ఫోన్ల తయారీకి ఉపయోగించే విడి భాగాలు, ఇతర పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో దేశంలో టీవీలు, స్మార్ట్‌ఫోన్ల ధరలు త్వరలో తగ్గే అవకాశాలున్నాయిన మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇంట్లో టీవీలు వాడుతూ ఉంటారు. ఇప్పటివరకు టీవీల ధరలు అధికంగా ఉన్నాయి. అలాగే మొబైల్స్ కూడా ప్రతిఒక్కరూ వాడుతున్నారు. వీటి ధరలు తగ్గనుండటం సామాన్యులకు శుభవార్తగానే చెప్పవచ్చు. భారత్ ఎక్కువగా విదేశాల నుంచి టీవీలు, స్మార్ట్‌ఫోన్ల తయారీకి ఉపయోగించే విడి భాగాలను దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. వీటిపై కస్టమ్స్ డ్యూటీని ఇప్పుడు తగ్గించడంతో వాటి ధరలు త్వరలో తగ్గే ఛాన్స్ ఉంది.

తగ్గనున్న వంటగది ఎలక్ట్రానిక్ వస్తువులు

ఇక వంట గదిలో ఉపయోగించే పలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా తగ్గనున్నాయి. మైక్రోవేవ్ ఓపెన్లపై కస్టమ్ డ్యూటిని ప్రభుత్వం తగ్గించింది. దీంతో వీటి ధరలు త్వరలో తగ్గున్నాయని తెలుస్తోంది. ఇక చెప్పులు, లెదర్ వస్తువులపై కూడా కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో నిర్మలమ్మ ప్రకటించారు. దీంతో వాటి ధరలు కూడా త్వరలో పడిపోనున్నాయి. అలాగే వీడియో గేమ్స్ తయారీకి ఉపయోగించే విడి భాగాలపై కూడా పన్ను రాయితీలను కేంద్రం ప్రకటించింది. దీంతో వాటి ధరలు కూడా తగ్గనున్నాయి. అయితే బడ్జెట్‌లో ప్రకటించగానే వెంటనే ధరలు తగ్గవు. బడ్జెట్ ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తోంది. దీంతో ఆ తర్వాత మెల్లమెల్లగా ధరలు తగ్గుతాయి. ఇక ఈవీ బ్యాటరీల ధరలు కూడా తగ్గనున్నాయి. అటు 17 రకాల క్యాన్సర్ మందులపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్యాన్సర్ రోగులకు ఊరట కలగనుంది.

వీటి ధరలు పెంపు

ఇక బడ్జెట్‌లో కొన్ని ధరలు తగ్గనుండగా.. మరికొన్ని ధరలు పెరగనున్నాయి. బొగ్గు, కాఫీ, వెండింగ్ మిషన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. సిగరేట్లు, విదేశీ మద్యం ధరలు పెరగనున్నాయి. ఇక పాన్ మసాలాా ధరలు కూడా భారీగానే పెరగనున్నాయి. ఇక బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలతో గడియారాలు, ఖరిజాల ధరలు కూడా పెరగనున్నాయి. దీంతో బడ్జెట్ వల్ల కొన్ని వస్తువుల ధరలు పెరగనుండగా.. మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి.  బడ్జెట్ వల్ల కొన్ని రంగాలు లాభపడనుండగా.. ధరల పెరుగుదలతో మరికొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.