
Insurance Scheme: కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు అనేక పథకాలను అమలు చేస్తుంది. ఇందులో ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలను అందించేందుకు అనేక పథకాలు ఉన్నాయి. అకాల మరణం ఏ మానవునికైనా ఎప్పుడైనా సంభవించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద కేవలం రూ.40 చెల్లించి రూ.2 లక్షల బీమా ఇస్తారు. మీరు ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకుందాం. అదే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం.
2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఏటా రూ.436 ప్రీమియం చెల్లించాలి. అంటే నెలవారీగా చూస్తే.. 436/12=36.3 అంటే ఒక వ్యక్తి ప్రతి నెలా దాదాపు రూ. 36 ఆదా చేస్తే సరిపోతుంది. దీంతో మీరు రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందుతారు. ఇందుకోసం జీవిత బీమా కార్పొరేషన్‌తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బీమా పథకం ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడుతూనే ఉంటుంది. ఈ పథకం వ్యవధి మే 1 నుండి జూన్ 31 వరకు ఉంటుంది. ప్రమాదం కారణంగా ఆకస్మికంగా మరణిస్తే నామినీకి రూ. 2 లక్షలు అందజేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తుదారు వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఎవరైనా ఆన్‌లైన్‌లోకి వెళ్లి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే దానిని పూరించిన తర్వాత మీరు దానిని మీ బ్యాంకులో డిపాజిట్ చేసి దాని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి మరింత సమాచారం పొందడానికి మీరు ఎల్‌ఐసీ, మీ బ్యాంక్ శాఖను కూడా సందర్శించవచ్చు.
వైద్య పరీక్ష అవసరం లేదు:
ఈ పాలసీ తీసుకోవడానికి మీకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. బీమా పాలసీ సమ్మతి లేఖలో కొన్ని నిర్దిష్ట వ్యాధులు పేర్కొనాల్సి ఉంటుంది. మీరు ఆ వ్యాధులతో బాధపడటం లేదని డిక్లరేషన్‌లో ప్రకటించాలి. మీ డిక్లరేషన్ తప్పు అని నిరూపిస్తే, మీ కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం ఉండదని గుర్తించుకోండి. నియమ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఇది కాకుండా, ఈ పథకంలో బీమా ప్రీమియంగా జమ చేసిన మొత్తంపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.
నమోదు నిబంధనలు:
నామినీ ఎలా క్లెయిమ్ చేయవచ్చు?
నామినీ సంబంధిత వ్యక్తి బీమా చేసిన బ్యాంకులో క్లెయిమ్ చేసుకోవాలి. మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి డిశ్చార్జ్ రసీదుతో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలను ఇవ్వాలి. నిబంధనల ప్రకారం, ప్రమాదం జరిగిన 30 రోజుల్లోపు క్లెయిమ్ దాఖలు చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి