Prachi Poddar: ఐఐఎం బెంగళూరు నుంచి వ్యాపారవేత్త వరకు.. ప్రాచి పోద్దార్ ప్రయాణం అందరికీ స్పూర్తిదాయకమే..

కోల్‌కత్తాకు చెందని ప్రాచి పోద్దార్ వ్యాపార రంగంలో దేశవ్యాప్తంగా పేరు పొందారు. తల్లిదండ్రులు చదువు వద్దన్నా.. వారికి నచ్చచెప్పి ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా గృహిణిగా తన ప్రయాణాన్ని ఆపలేదు. కుటుంబ వ్యాపారంలో రాణించి దేశవ్యాప్తంగా పేరు పొందారు.

Prachi Poddar: ఐఐఎం బెంగళూరు నుంచి వ్యాపారవేత్త వరకు.. ప్రాచి పోద్దార్ ప్రయాణం అందరికీ స్పూర్తిదాయకమే..
Prachi Poddar

Updated on: Jan 19, 2026 | 8:57 AM

పెళ్లైతే మహిళలు ఇంటికే పరిమితం కావాలని ఆలోచిస్తున్న నేటి కాలంలో ఆమె అందుకు భిన్నంగా తన బాటను ఎంచుకుంది. పెళ్లైనా తర్వాత ఇంట్లో కూర్చోకుకుండా తన స్వయం శక్తితో ఎదగాలనే పట్టుదలతో వ్యాపారంలో రాణించింది. అనతికాలంలోనే  తన కంపెనీలో పేరు పొంది దేశవ్యాప్తంగా ప్రసిద్ది పొందింది. కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలు కేవలం ఇంటికే పరిమితం కావాలని ఆలోచిస్తున్న తరుణంలో కోల్‌కత్తాకు చెందిన ప్రాచి పోద్దార్ వ్యాపార రంగంలో రాణించింది. ఇప్పుడు అదే ఆమెకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చి పెట్టింది. ఎంతోమందికి స్పూర్తి కలిగిస్తున్న ప్రాచి పోద్దార్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం.

ఐఐఎం బెంగళూరులో చదువు

ప్రాచి పోద్దార్ సాంప్రదాయ మార్వాడీ కుటుంబంలో జన్మించారు. వారి ఫ్యామిలీలో మహిళలకు విద్యలో తొలుత నుంచి ప్రాధాన్యత ఇవ్వలేదు. 2011లో ఐఐఎం బెంగళూరులో ప్రాచికి సీటు రాగా.. తొలుత కుటుంబసభ్యులు అంగీకరించలేదు. చదువు పూర్తైన తర్వాత వచ్చి పెళ్లి చేసుకోవాలని షరతు విధించారు. దీంతో ఈ షరతును అంగీకరించి ఐఐఎం బెంగళూరులో చదువు పూర్తి చేసిన తర్వాత వవ్చి వివాహం చేసుకున్నారు ప్రాచి పోద్దార్. ఆ తర్వాత ఇండియాలో జీఈ ఫైనాన్షియల్, అమెరికాలో హెచ్‌ఎస్‌బీసీ వంటి సంస్థల్లో పనిచేశారు. అక్కడ ఆర్ధిక విషయాలు, వ్యాపారంలో మెళుకువులు తెలుసుకున్నారు.

కొత్త వ్యాపార ఆలోచన

తన అత్తమామలు అనారోగ్యానికి గురి కావడంతో ప్రాచి తిరిగి కోల్‌కత్తాకు తిరిగి వచ్చారు. అత్తమామల బాగోగులు చూసుకుంటూనే తన కుటుంబానికి చెందిన సిమెంట్ రవాణా వ్యాపారంలో భర్తకు అండగా ఉండేవారు. ఇదే ఆమె ప్రయాణంలో కీలక మలుపుగా మారింది. మూడు సంవత్సరాల క్రితం ఆమెకు కొత్త వ్యాపార ఆలోచన వచ్చింది. సిమెంట్ వ్యర్థాల నుంచి వచ్చే సున్నపురాయి నుంచి రాతి చిప్స్ ఉత్పత్తి చేయడం ప్రారంబించారు. ఈ ఆలోచన సక్సెస్ కావడంతో వ్యాపారాన్ని మరింత విస్తరించారు. జగన్నాథ్ స్టోన్స్ ఆధ్వర్యంలో సున్నపురాయి క్రషింగ్ చేసే పని మొదలుపెట్టారు. ప్రస్తుతం జగన్నాథ్ స్టోన్స్ ఆర్ధిక వ్యవహారాలు అన్నీ ప్రాచి చూసుకుంటున్నారు.

పెట్టుబడిదారులకు ముఖ్య గమనిక

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారికి గమనిక. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు KYC తప్పనిసరిగా పూర్తి చేయాలి.  రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. కంపెనీల జాబితా SEBI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. పెట్టుబడికి సంబంధించి ఏదైనా సమస్య లేదా ఫిర్యాదు ఉంటే సంబంధిత AMCని సంప్రదించవచ్చు. SCORES పోర్టల్ ద్వారా ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు. ఫిర్యాదు సంతృప్తికరంగా పరిష్కరించబడకపోతే స్మార్ట్ ODR పోర్టల్‌ను ఆశ్రయించవచ్చు.

HDFC AMC

HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్  ఇండియాలో ప్రముఖ మ్యూచువల్ ఫండ్ కంపెనీలలో ఒకటిగా ఉంది. 1999లో ఈ కంపెనీని స్థాపించారు. SEBI ఆమోదం పొందిన తర్వాత 2000లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఈక్విటీ, స్థిర ఆదాయం, ఇతర పెట్టుబడి ఎంపికలను కంపెనీ నిర్వహిస్తుంది.