PPF Scheme: ప్రస్తుతం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో పన్ను మినహాయింపు,రిస్క్ లేకుండా మంచి రాబడి వచ్చే ప్రయోజనాలు ఉన్నాయి. ఈ స్కీమ్‌లలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ (PPF) ఒకటి. ఈ స్కీమ్‌లో మంచి రాబడి ఉంది. అందుకే చాలా మంది పీపీఎఫ్ స్కీమ్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. పీపీఎఫ్ అనేది ప్రభుత్వ హామీ కలిగిన స్మాల్ సేవింగ్ స్కీమ్. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. పెట్టుబడి పెట్టిన డబ్బులపై వడ్డీ, మెచ్యూరిటీ సమయంలో తీసుకునే డబ్బులపై ఎలాంటి పన్ను ఉండదు.
ఈ స్కీమ్‌లో చేరినట్లయితే ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో ఒకేసారి ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా వాయిదా రూపంలో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో రోజుకు రూ.400 వరకు లేదా నెలకు. 12,500 వరకు చెల్లించవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు.
ఉద్యోగులు ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందవచ్చు. సెక్షన్ 80సీ కింద ఈ ప్రయోజనం పొందవచ్చు. అయితే ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు సమీక్షిస్తుంటుంది. ఆ సమయంలో వడ్డీ రేటు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే చాలు. లేదా ఏడాదికి రూ.1.5 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరటీ సమయంలో ఏకంగా రూ.1 కోటి వరకు ప్రయోజనం పొందవచ్చు. అయితే మెచ్యూరిటీ కాలాన్ని 5 ఏళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు.మీరు పీపీఎఫ్‌లో 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే.. మీ చేతికి రూ. 1.54 కోట్ల వరకు వస్తాయి. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రూ. 45 లక్షలు అవుతాయి. మిగతా రూ. కోటి మీ రాబడి అవుతుందని గుర్తించుకోవాలి. ఇలా డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారికి ఈ పీపీఎఫ్ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక వేళ వడ్డీ రేటు పెరిగినట్లయితే ఇంకా ఎక్కువ డబ్బులు పొందవచ్చు.
ఇవి కూడా చదవండి: