PPF: ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే పీపీఎఫ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందా.. అది ద్రవ్యోల్బణం కంటే అధికంగా ఉంటుందా..

|

Jan 29, 2022 | 4:30 PM

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (ppf) హామీతో కూడిని ప్రభుత్వ పథకం. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్(fixed deposit) వ‌డ్డీ రేటు క‌న్నా ఇందులో అధికంగానే వ‌డ్డీని ఆశించ‌వ‌చ్చు..

PPF: ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే పీపీఎఫ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందా.. అది ద్రవ్యోల్బణం కంటే అధికంగా ఉంటుందా..
Ppf
Follow us on

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (ppf) హామీతో కూడిని ప్రభుత్వ పథకం. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్(fixed deposit) వ‌డ్డీ రేటు క‌న్నా ఇందులో అధికంగానే వ‌డ్డీని ఆశించ‌వ‌చ్చు. పీపీఎఫ్ ఖాతాను ప్రభుత్వ రంగ బ్యాంకులో గానీ, పోస్టాఫీసు(Post Office)లో గానీ తెరవొచ్చు. పీపీఎఫ్ వ‌డ్డీని నెల‌వారీ ప్రాతిప‌దిక‌న లెక్కిస్తారు. పీపీఎఫ్ ఖాతా 100% రిస్క్ లేనిది, అంతేగాక 6% స‌గ‌టు వార్షిక ద్రవ్యోల్బణం వృద్ధిని అధిగ‌మించ‌గ‌ల పొదుపు ప‌థ‌కాల్లో ఇదొకటని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం, పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. పీపీఎఫ్ వ‌డ్డీని నెల‌వారీ ప్రాతిప‌దిక‌న లెక్కిస్తారు. నెల‌లో 5వ తేదీ నుండి చివ‌రి తేదీ వ‌ర‌కు అందుబాటులో ఉన్న క‌నీస పీపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌పై పీపీఎఫ్ వ‌డ్డీని ఇస్తారు. కాబ‌ట్టి, పీపీఎఫ్ ఖాతాదారుడు నెల‌లో 1వ తేదీ నుండి 4వ తేదీ వ‌ర‌కు డిపాజిట్ చేసిన‌ట్లయితే ఆ నెల పీపీఎఫ్ వ‌డ్డీకి అర్హత ఉంటుంది. నెల‌వారీగా పీపీఎఫ్‌లో పొదుపు చేసే పెట్టుబ‌డిదారులు నెల 1 నుండి 4 వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టడం మంచిది.

సంవ‌త్సరానికొక‌సారి డ‌బ్బులు క‌ట్టేవారు కూడా ఏప్రిల్ 1 నుండి 4 వ‌ర‌కు డిపాజిట్ చేయ‌డం మంచిది. అప్పుడు వారి డిపాజిట్‌పై మొత్తం ఆర్ధిక సంవ‌త్సరానికి (12 నెలలు) పీపీఎఫ్‌కి వ‌డ్డీని పొందొచ్చు. పెట్టుబ‌డిదారునికి అస‌లుపైనే కాకుండా వ‌డ్డీపై వ‌డ్డీ కూడా వ‌స్తుంది. గ‌రిష్ఠంగా రూ.1.50 ల‌క్షలు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. ఇంత‌క‌న్నా ఎక్కువ డిపాజిట్ చేసినా రూ.1.50 ల‌క్షల‌కే వ‌డ్డీ వస్తుంది. ఒక వ్యక్తి ఒక పీపీఎఫ్ ఖాతాను మాత్రమే తెరిచేందుకు అనుమతి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతా విష‌యంలో ఉమ్మడి ఖాతా తెర‌వ‌డం కుదరదు. మైనర్ పేరున కూడా పీపీఎఫ్‌ ఖాతా తెరవచ్చు.
పీపీఎఫ్ ఖాతాదారుడు మెచ్యూరిటీ త‌ర్వాత, అంటే 15 సంవ‌త్సరాలు పూర్తయిన త‌ర్వాత మాత్రమే పీపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ను పూర్తిగా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. అయితే ఆర్ధిక అత్యవ‌స‌ర ప‌రిస్థితుల్లో ఖాతా తెరిచిన 7వ సంవ‌త్సరం నుండి పాక్షికంగా పీపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ చేసుకోవ‌చ్చు. పీపీఎఫ్ ఖాతా తెరిచిన 4 సంవ‌త్సరాలు పూర్తయిన త‌ర్వాత కూడా అత్యవసర ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఉంటుంది.

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం, ఒక ఆర్థిక సంవ‌త్సరంలో పీపీఎఫ్ డిపాజిట్‌తో రూ.1.50 ల‌క్షల వ‌ర‌కు ఆదాయ‌పు ప‌న్ను మినహాయింపు పొందొచ్చు. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు (ఐటీఆర్‌) ఫైల్ చేసేట‌పుడు సెక్షన్ 80సీ కింద ఈ ప‌న్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయాలి. మీ ఉద్యోగ సంస్థకి కూడా ఈ మినహాయింపు తెలియజేయొచ్చు. అలాగే ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో పీపీఎఫ్ మెచ్యూరిటీ మొత్తానికి 100% ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

Read Also.. Petrol Price Today: స్థిరంగా కొనసాగుతోత‌న్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. ఫిబ్ర‌వ‌రి 2 త‌ర్వాత మాత్రం..