Post Office scheme: పోస్టాఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది పోస్టల్ శాఖ. పలు స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేసే డబ్బులపై అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. మీ పొదుపును గణనీయంగా పెంచుకోవడంతో సహాయపడతాయి. ఇక పోస్టాఫీసుల్లో ఉన్న స్కీమ్‌లలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కిమ్ (SCSS) ఒకటి. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 7.4 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. సీటియర్ సిటిజర్స్‌కు ఈ సేవింగ్స్ స్కీమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. మీ డబ్బును ఇందులో ఇన్వెస్ట్ చేస్తే కొంతకాలం వ్యవధిలో అధిక రాబడి పొందవచ్చు.
ఈ స్కీమ్‌లో చేరాలనుకుంటే కేవలం రూ.1000లతో అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. 60ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేరవచ్చు. అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మెచ్యూరిటీ సమయం ముగిసేలోగా రూ.14 లక్షల బెనిఫిట్ పొందవచ్చు. పెట్టుబడిదారుడు పోస్ట్ ఆఫీసు స్కీమ్‌లో ఏకమొత్తంలో రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత వారు 7.4 శాతం వడ్డీ రేటుతో రూ.14,28,964 అందుకుంటారు. అయితే పెట్టుబడిదారుడు దీనిపై రూ.4,28,000కుపైగా వడ్డీ పొందుతాడు. ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఉంచవచ్చు.
అయితే ఈ స్కీమ్‌లో చేరిన వారు మెచ్యూరిటీ కాలానికి మరో మూడే ళ్లు పొడిగించవచ్చు. అదే వడ్డీ రేటుతో రూ.లక్ష కంటే తక్కువ నగదుతో ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్‌లోని ఇన్వెస్ట్‌లకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు ఉంది.
ఇవి కూడా చదవండి: