Post Office Scheme: పోస్టాఫీసులో పిల్లల కోసం అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే ప్రతి నెల రూ.2,500

|

Sep 20, 2022 | 5:57 AM

Post Office Scheme: పోస్టాఫీసుల్లో అనేక రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం ద్వారా మంచి రాబడిని అందుకోవచ్చు. మీ పిల్లల పేరుపై.

Post Office Scheme: పోస్టాఫీసులో పిల్లల కోసం అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే ప్రతి నెల రూ.2,500
Post Office Scheme
Follow us on

Post Office Scheme: పోస్టాఫీసుల్లో అనేక రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం ద్వారా మంచి రాబడిని అందుకోవచ్చు. మీ పిల్లల పేరుపై కూడా ఇన్వెస్ట్‌ మెంట్‌ చేసి నెలనెల రాబడి అందుకోవచ్చు. పోస్టాఫీసుల్లో ఉత్తమమైన స్కీమ్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌. ఇందులో ఒక్కసారి డబ్బును ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే నెలనెలా వడ్డీ రూపంలో రాబడి అందుకోవచ్చు. ఈ పోస్టాఫీసు సేవింగ్స్‌ స్కీమ్‌లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరుతో కూడా తెరవవచ్చు. మీరు మీ పిల్లల పేరుతో ఈ ప్రత్యేక ఖాతాను (పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్) తెరిస్తే, మీరు అతని స్కూల్ ఫీజు గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

ఖాతాను ఓపెన్‌ చేయడం ఎలా..?

మీరు ఏదైనా పోస్టాఫీసులో మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ను ఓపెన్‌ చేయవచ్చు. దీని కింద కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.4.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకం కింద వడ్డీ రేటు 2021 ప్రకారం 6.6 శాతం ఉంటుంది. పిల్లల వయస్సు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే, మీరు అతని పేరు మీద ఈ ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ 5 సంవత్సరాలు, ఆ తర్వాత దానిని మూసివేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మీ పిల్లల వయస్సు 10 సంవత్సరాలు ఉంటే అతని పేరు మీద రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే, ప్రతి నెలా మీ వడ్డీ ప్రస్తుత 6.6 శాతం ప్రకారం రూ. 1100 అవుతుంది. ఐదేళ్లలో, ఈ వడ్డీ మొత్తం 66 వేల రూపాయలు అవుతుంది. చివరిగా మీరు 2 లక్షల రూపాయల రిటర్న్ కూడా పొందుతారు. ఈ విధంగా, మీరు ఈ స్కీమ్‌పై రూ.1100 వరకు పొందవచ్చు. ఈ డబ్బును అతని స్కూల్‌ ఫీజు కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తం తల్లిదండ్రులకు మంచి సహాయం అవుతుంది. అదేవిధంగా రూ.4.5 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా దాదాపు రూ.2500 వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి