కచ్చితమైన రాబడితో పాటు భద్రతగా ఉండే పెట్టుబడి పథకాల్లో పోస్టాఫీస్ పథకాలు(Post Office Scheme) ఉన్నాయి. అందులో అత్యధికంగా రాబడి నిచ్చే పథకం పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. దీనిలో మీరు దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడి పెడితే లక్షాధికారి కావొచ్చు. పెట్టుబడి కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. పైగా పన్ను కూడా ఉండదు.
మీరు నెలవారీ PPFలో రూ. 5,000 పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాలలో మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి రూ. 16 లక్షల కంటే ఎక్కువ నగదు వస్తుంది.
పోస్టాఫీసు PPF పథకం దీర్ఘకాలంలో సంపద సృష్టికి మెరుగైన పథకం. మీరు పీపీఎఫ్‌లో ప్రతి నెలా రూ.5,000 చొప్పున పెట్టుబడి పెడుతున్నారనుకుందాం. మీ పెట్టుబడి సంవత్సరానికి రూ. 60,000 అయింది. మీ PPF ఖాతా 15 సంవత్సరాలలో మెచ్యూర్ అయినప్పుడు, మీరు రూ. 16,27,284 లక్షలు ఎప్పుడు పొందుతారు. ఇందులో మీ పెట్టుబడి రూ. 9 లక్షలు కాగా, రూ. 7.27 లక్షల కంటే ఎక్కువ లాభం ఉంటుంది.
PPFలో ప్రస్తుతం వార్షికంగా 7.1 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇదే వడ్డీ రేట్లు మెచ్యూరిటీ వరకు ఉంటే, మీరు 16 లక్షల కార్పస్‌ను సృష్టించడం సులభం అవుతుంది. PPFలో కాంపౌండింగ్ వార్షిక ప్రాతిపదికన జరుగుతుంది. PPF ఖాతాలో, ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ రేట్లను మారుస్తుంది. పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ 15 ఏళ్లు. కానీ ఖాతాదారులు 5 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.
PPFలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఈ పథకంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి మినహాయింపు తీసుకోవచ్చు. PPFలో సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితం. ఈ విధంగా PPFలో పెట్టుబడి EEE వర్గంలోకి వస్తుంది. PPF ఖాతాపై రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. PPF ఖాతా తెరిచిన సంవత్సరం చివరి నుండి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, 5 సంవత్సరాలు పూర్తయ్యేలోపు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also.. LIC Policyholders: ఎల్‌ఐసీ పాలసీదారులకు అలర్ట్.. ఫిబ్రవరి 28లోగా ఆ వివరాలు అప్‌డేట్ చేసుకోండి..!