పెట్టుబడికి ఉత్తమ మార్గం ఈ ప్రభుత్వ పథకం.. మెరుగైన వడ్డీ.. ఇంకా పన్నుమినహాయింపు..

|

Jan 16, 2022 | 8:26 AM

National Savings Certificate: మీరు భవిష్యత్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్టాఫీసు ఉత్తమ ఎంపిక. ఇందులో చాలా రకాల సేవింగ్‌ స్కీమ్స్‌

పెట్టుబడికి ఉత్తమ మార్గం ఈ ప్రభుత్వ పథకం.. మెరుగైన వడ్డీ.. ఇంకా పన్నుమినహాయింపు..
Savings
Follow us on

National Savings Certificate: మీరు భవిష్యత్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్టాఫీసు ఉత్తమ ఎంపిక. ఇందులో చాలా రకాల సేవింగ్‌ స్కీమ్స్‌ ఉన్నాయి. ఇందులో మీరు కచ్చితంగా మంచి రాబడిని పొందుతారు. అలాగే మీ డబ్బుకి భద్రత ఉంటుంది. ఒకవేళ బ్యాంకు డిఫాల్ట్ అయితే మీరు కేవలం ఐదు లక్షల రూపాయల తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసులో అలా కాదు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో తక్కువ పెట్టుబడితో పొదుపు ప్రారంభించవచ్చు. పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) ఒకటి. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.

పోస్టాఫీసు సంబంధించి ఈ పథకంలో 6.8 శాతం వడ్డీ రేటు కొనసాగుతోంది. వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన నిర్ణయిస్తారు. మెచ్యూరిటీపై పూర్తిగా చెల్లిస్తారు. ఈ వడ్డీ రేటు 1 ఏప్రిల్ 2020 నుంచి వర్తిస్తుంది. ఇందులో రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.1389.49కి పెరుగుతుంది. ఈ పోస్టాఫీసు పథకంలో కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో ఒక వయోజన, ముగ్గురు పెద్దలు ఉమ్మడిగా ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇది కాకుండా మైనర్ తరపున గార్డియన్ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం కింద 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ కూడా ఖాతాని ఓపెన్ చేయవచ్చు.

ఈ పథకంలో డిపాజిట్ చేసిన మొత్తం డిపాజిట్ తేదీ నుంచి ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఈ చిన్న పొదుపు పథకంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు కోసం క్లెయిమ్ చేయవచ్చు. ఆదాయపు పన్ను ఈ విభాగంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం అందిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో 5 సంవత్సరాల FDకి ముందు కొన్ని సందర్భాల్లో ఖాతాను మూసివేసే అవకాశం ఉంటుంది. ఖాతాదారుడు మరణించినప్పుడు లేదా జాయింట్ ఖాతాలోని ఖాతాదారులందరూ మరణించిన తర్వాత ఖాతాను మూసివేయవచ్చు. ఇది కాకుండా కోర్టు ఆదేశాలపై కూడా ఖాతాను మూసివేసే అవకాశాలు ఉంటాయి.

తోడేళ్లని విపరీతంగా చంపుతున్న స్వీడెన్, నార్వే ప్రజలు.. దీని వెనుక కారణం ఏంటంటే..?

IND vs SA U-19 World Cup: సౌతాఫ్రికాపై భారత్‌ సూపర్ విక్టరీ.. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన యశ్ ధూల్‌..

ప్రతి నొప్పికి ఔషధం మీ వంటగదిలోనే ఉంది..! కరోనా సమయంలో వాటిని గుర్తించడం అత్యవసరం..