Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10 వేల డిపాజిట్‌తో రూ.7 లక్షలు పొందవచ్చు

|

Aug 11, 2021 | 4:33 PM

Post Office: డబ్బులు దాచుకోవడానికి పోస్టాఫీసుల్లో అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌ శాఖలో వివిధ రకాల..

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10 వేల డిపాజిట్‌తో రూ.7 లక్షలు పొందవచ్చు
Follow us on

Post Office: డబ్బులు దాచుకోవడానికి పోస్టాఫీసుల్లో అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌ శాఖలో వివిధ రకాల స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోస్టాఫీస్ పలు రకాల సేవింగ్ స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్‌ అందించే స్కీమ్స్‌లో రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెడితే మంచి రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్‌లో చేరితే మీరు నెలకు రూ.100 నుంచి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అదే సమయంలో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ప్రతి నెలా డబ్బులు పెడుతూనే ఉండాలి.

పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్ గడువు 5 ఏళ్లు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ అకౌంట్‌లో జమ అవుతూ వస్తుంది. ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు సమీక్ష ఉంటుంది. అంటే వడ్డీ రేటు తగ్గొచ్చు.. లేదా పెరగొచ్చు. లేదంటే అలానే స్థిరంగా కొనసాగవచ్చు. ఈ స్కీమ్‌లో చేరి నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెడితే.. ఐదేళ్ల తర్వాత 7 లక్షల రూపాయల వరకు పొందవచ్చు. రిస్క్ అనేది ఉండదు. కచ్చితమైన లాభం వస్తుంది. రిస్క్ తీసుకోలేని వారు పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో చేరవచ్చు. ఈ స్కీమ్‌లో ఒక వ్యక్తిగానీ, ముగ్గురు కలిపి కూడా దీనిని ఉమ్మడి ఖాతాగా తీసుకుని పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే మైనర్ల పేరు మీద కూడా ఖాతా ఓపెన్‌ చేసి అన్వెస్ట్‌ చేసుకోవచ్చు. కనీసం 10 సంవత్సరాలపైబడిన వారు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

అయితే మీరు 1 నుంచి 15వ తేదీ మధ్యలో అకౌంట్‌ తెరిచినట్లయితే ప్రతి నెల 15వ తేదీ లోపు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. అలాగే 15వ తేదీ తర్వాత ఖాతా తీసినట్లయితే ప్రతి నెల చివరి దినం వరకు మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. గడువులోగా మొత్తాన్ని జమ చేయకపతే డిఫాల్డ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో అడ్వాన్స్‌ డిపాజిట్‌ చేస్తే కొంత మినహాయింపు ఉంటుంది. మీరు ఆరు నెలల పాటు అడ్వాన్స్‌ డిపాజిట్‌ చేస్తే నెలవారీ ప్రీమియంలో 10 శాతం డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. ఎవరైనా ప్రతి నెల డిపాజిట్‌ చేస్తే ఆరు నెలల పాటు అతను రూ.6000కు బదులు రూ.5900 మాత్రమే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక సంవత్సరం మొత్తం డిపాజిట్‌ చేస్తే ఈతనికి నెలవారీ ప్రీమియంలో 40 శాతం వరకు రాయితీ లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక సంవత్సరానికి మొత్తం డిపాజిట్‌ రూ.12,000కు బదులు రూ.11,600 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

డిపాజిట్‌ మొత్తంలో 50 శాతం రుణం పొందవచ్చు

ఇక ఒక సంవత్సరం తర్వా డిపాజిట్‌ మొత్తంలో 50 శాతం వరకు రుణం పొందవచ్చు. దానిని వివిధ వాయిదాల రూపంలో కూడా తిరిగి చెల్లించవచ్చు. రికరింగ్‌ డిపాజిట్ల వడ్డీపై వడ్డీ రేటు 2 శాతం వీడిగా ఉంటుంది. ఇక కాలిక్యులేటర్‌ ప్రకారం.. మీరు ప్రతి నెలా రూ.10 వేలు ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేసినట్లయితే ప్రస్తుతం 5.8 శాతం వడ్డీ రేటుతో, మెచ్యూరిటీపై మొత్తం రూ.69,6967 అవుతుంది. 5 సంవత్సరాలలో మొత్తం డిపాజిట్‌ మొత్తం రూ.6 లక్షలు అవుతుంది. ఇక వడ్డీ మొత్తం రూ.99967 అవుతుంది. ఈ విధంగా మెచ్యూరిటీ మొత్తం దాదాపు రూ.7 లక్షల వరకు పొందవచ్చు.

ఇవీ కూడా చదవండి

PMSBY Scheme: అదిరిపోయే స్కీమ్‌.. నెలకు రూ.1 డిపాజిట్‌ చేస్తే రూ.2 లక్షల వరకు పొందవచ్చు.. ఎలాగంటే..!

Solar Panel: ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను అమర్చడానికి ఎంత ఖర్చు అవుతుంది..? సోలార్ ప్యాన‌ల్ బిజినెస్ చేయ‌డం ఎలా?