Poonam Gupta: మహిళలకు ఆదర్శం ఆమె.. ఉద్యోగం రాకపోయినా రూ.లక్ష పెట్టుబడితో 800 కోట్ల టర్నోవర్‌ కంపెనీ..!

| Edited By: Ram Naramaneni

Nov 05, 2023 | 9:53 PM

ఉద్యోగమే పరమావధిగా చదివేవాళ్లు చాలా మంది ఉంటారు. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా కష్టపడి పని చేస్తే విజయం లభిస్తుంది. అయితే ఓ మహిళ ఉద్యోగం రాలేదని బాధపడకుండా కేవలం రూ.లక్షతో పేపర్ రీసైక్లింగ్ వ్యాపారాన్ని ప్రారంభించి, ఇప్పుడు తన కంపెనీ విలువ రూ.800 కోట్లకు చేరిన ఎన్నారై వ్యాపారవేత్త విజయగాథ గురించి మనం ఓ సారి తెలుసుకుందాం.

Poonam Gupta: మహిళలకు ఆదర్శం ఆమె.. ఉద్యోగం రాకపోయినా రూ.లక్ష పెట్టుబడితో 800 కోట్ల టర్నోవర్‌ కంపెనీ..!
Poonam Gupta
Follow us on

భారతదేశంలో వేతన జీవుల సంఖ్య ఎక్కువ. ఈ నేపథ్యంలో చాలా మంది ఏదైనా ఉద్యోగానికి ఎంపికవ్వకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. ఉద్యోగమే పరమావధిగా చదివేవాళ్లు చాలా మంది ఉంటారు. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా కష్టపడి పని చేస్తే విజయం లభిస్తుంది. అయితే ఓ మహిళ ఉద్యోగం రాలేదని బాధపడకుండా కేవలం రూ.లక్షతో పేపర్ రీసైక్లింగ్ వ్యాపారాన్ని ప్రారంభించి, ఇప్పుడు తన కంపెనీ విలువ రూ.800 కోట్లకు చేరిన ఎన్నారై వ్యాపారవేత్త విజయగాథ గురించి మనం ఓ సారి తెలుసుకుందాం.

ప్రముఖ వ్యాపారవేత్త పూనమ్ గుప్తా ఢిల్లీలో జన్మించింది. ఢిల్లీలో లేడీ ఇర్విన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో తన ప్రారంభ విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. ఆమె ఢిల్లీలోని ఎఫ్‌ఓఆర్‌ఈ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, హాలండ్‌లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టా కూడా పొందారు. పూనమ్‌ గుప్తా 2002లో పునీత్ గుప్తాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత స్కాట్లాండ్‌కు వెళ్లింది, అక్కడ ఆమె ఉద్యోగం పొందలేకపోయింది. దీంతో ఆమె వ్యాపారాల వైపు అడుగులు వేసింది.

పూనమ్ 2003లో స్కాట్లాండ్‌లోని కిల్మాకోమ్‌లోని తన కుటుంబ ఇంటి నుంచి స్కాటిష్ ప్రభుత్వ పథకం నుండి రూ. 1 లక్ష నిధులను స్వీకరించిన తర్వాత తన మొదటి వ్యాపారమైన పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్‌ని ప్రారంభించింది. పీజీ పేపర్ ప్రపంచంలోని 53 దేశాల నుండి వస్తువులను దిగుమతి, ఎగుమతులను చేస్తుంది. అలాగే యునైటెడ్ కింగ్‌డమ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పేపర్ కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ ప్రస్తుతం ఏడాదికి 800 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

పూనమ్ గుప్తా తన కంపెనీని 2003 సంవత్సరంలో ప్రారంభించింది. నేటికి దాదాపు 19 సంవత్సరాలు. చాలా నెలల పరిశోధన తర్వాత, స్క్రాప్ పేపర్‌ను రీసైక్లింగ్ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లింది. ముఖ్యంగా యూరప్, అమెరికాలోని కంపెనీల నుంచి చిత్తు కాగితాలను కొనుగోలు చేసేది. ఇప్పుడు ఇది ప్రపంచంలోని అనేక దేశాల నుంచి స్క్రాప్ తీసుకుంటుంది. మంచి నాణ్యమైన కాగితాన్ని కూడా తయారు చేసి ఇతర దేశాలకు పంపుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి