PNB Friendly Unnati Home Loan: ప్రైవేట్, చిన్నా చితకా ఉద్యోగాలు చేసే యువతకు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ సరికొత్త అవకాశాన్ని కల్పిస్తోంది. `కస్టమర్ ప్రెండ్లీ ఉన్నతి హోమ్ లోన్`ను రూ.35 లక్షల వరకు అందిస్తోంది. కనీస గృహ రుణ మొత్తం టైర్-1 నగరాలకు రూ. 8 లక్షలు, టైర్-2 నగరాలకు రూ. 6 లక్షలు అందిస్తోంది. ఈ ఉన్నతి గృహ రుణం ధరఖాస్తు చేసిన వారికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద సబ్సిడికి కూడా అర్హులుగా ప్రకటించింది.
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ కస్టమర్-ప్రెండ్లీ ఉన్నతి గృహ రుణాన్ని రూ. 35 లక్షల వరకు, లేదా ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ఆస్తి మార్కెట్ విలువలో 90% వరకు, స్వయం ఉపాధి వ్యక్తుల కోసం ఆస్తి మార్కెట్ విలువలో 80% వరకు గృహ రుణాన్ని అందిస్తోంది. కనీస గృహ రుణం నగరాలను బట్టీ రూ. 6 – రూ. 8 లక్షలు కూడా అందిస్తోంది. 225 చదరపు అడుగులు లేదా 40 చదరపు గజాల కొలత కలిగిన కనీస పరిమాణ గృహాల కోసం కూడా ఈ రుణాలనందిస్తుంది. ఇల్లు కొనాలని, జీవిత లక్ష్యాన్ని వేగంగా నెరవేర్చుకోవాలని కోరుకునే వారికి ఉన్నతి హోమ్ లోన్‌ను ప్రారంభించామని పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఎండి తెలిపారు. ఈ రుణం తక్కువ, మధ్య తరగతి ఆదాయ వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. 2022 నాటికి `హౌస్ ఫర్ ఆల్` అనే ప్రభుత్వ నినాదాన్ని నిజం చేస్తుంది. ఈ గృహ రుణాలకు వడ్డీ రేటు 10.75%, కాల పరిమితి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు.