AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వమే ఫ్రీగా రూ.78000 ఇస్తుంది! మీరు కరెంట్‌ కూడా అమ్ముకోవచ్చు!

పెరుగుతున్న విద్యుత్ బిల్లుల నుండి ఉపశమనం కోసం కేంద్రం "పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన" ప్రారంభించింది. ఈ పథకం కింద రూ.78,000 వరకు సబ్సిడీతో ఇంటిపై సోలార్ ప్యానెల్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా విద్యుత్ బిల్లులు సున్నా అవుతాయి. తక్కువ వడ్డీకి బ్యాంక్ లోన్‌లు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియతో సౌలభ్యం లభిస్తుంది.

ప్రభుత్వమే ఫ్రీగా రూ.78000 ఇస్తుంది! మీరు కరెంట్‌ కూడా అమ్ముకోవచ్చు!
Solar Panel
SN Pasha
|

Updated on: Apr 09, 2026 | 6:00 AM

Share

ప్రతి నెలా పెరుగుతున్న విద్యుత్ బిల్లులు సామాన్య కుటుంబాల బడ్జెట్‌ను కుదేలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన ఒక పెద్ద ఉపశమనంగా మారింది. ఈ పథకం ద్వారా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకుంటే, విద్యుత్ బిల్లును దాదాపు సున్నాకు తగ్గించుకోవచ్చు. ఈ పథకం కింద ప్రభుత్వం గరిష్టంగా రూ.78,000 వరకు సబ్సిడీ అందిస్తోంది. 1 కిలోవాట్ సిస్టమ్‌కు రూ.30,000, 2 కిలోవాట్‌కు రూ.60,000, 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి రూ.78,000 వరకు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. దీంతో సాధారణ ప్రజలు భారీ పెట్టుబడి లేకుండానే సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే అవకాశం పొందుతున్నారు.

మిగిలిన ఖర్చుల కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తున్నాయి. రూ.2 లక్షల వరకు రుణాన్ని సుమారు 5.75 శాతం వడ్డీతో, ఎలాంటి తాకట్టు లేకుండా పొందవచ్చు. అవసరమైతే రూ.6 లక్షల వరకు రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రుణ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఆధార్, విద్యుత్ బిల్లు, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక పత్రాలతో 15–20 నిమిషాల్లో దరఖాస్తు పూర్తి చేయవచ్చు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే రుణం మంజూరు అవుతుంది.

ఈ పథకం కింద 10 సంవత్సరాల తిరిగి చెల్లింపు గడువు, అలాగే ప్రారంభంలో 6 నెలల మారటోరియం సౌకర్యం కూడా ఉంది. అదనంగా ‘నెట్ మీటరింగ్’ సదుపాయం ద్వారా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించి అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. సోలార్ విద్యుత్ వైపు మారడం ద్వారా ఖర్చులు తగ్గడమే కాకుండా, దీర్ఘకాలికంగా ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం, సామాన్యులకు విద్యుత్ స్వావలంబన దిశగా ఒక కీలక అడుగుగా నిలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us