Budget 2024: దేశంలో కోటి కుటుంబాలకు 300 యూనిత ఉచిత విద్యుత్‌!

|

Jul 24, 2024 | 1:21 PM

రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ద్వారా భారతదేశంలో కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో స్పష్టం చేసింది. ప్రధానమంత్రి సూర్య ఘర్ బిజిలీ యోజన పథకం కింద భారతదేశంలోని కోటి గృహాలు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చని.

Budget 2024: దేశంలో కోటి కుటుంబాలకు 300 యూనిత ఉచిత విద్యుత్‌!
Pm Surya Ghar
Follow us on

రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ద్వారా భారతదేశంలో కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో స్పష్టం చేసింది. ప్రధానమంత్రి సూర్య ఘర్ బిజిలీ యోజన పథకం కింద భారతదేశంలోని కోటి గృహాలు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జూలై 23న పార్లమెంట్‌లో బడ్జెట్‌ సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.ఈ పథకం ద్వారా గృహాలు విద్యుత్ బిల్లులను ఆదా చేయడంతోపాటు మిగులు విద్యుత్‌ను డిస్కమ్‌లకు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందగలుగుతారు.

సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌లోని ప్రకటనకు అనుగుణంగా 1 కోటి గృహాలు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందేందుకు వీలుగా రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభించారు. ఈ పథకం 1.28 కోట్ల కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు, 14 లక్షల దరఖాస్తులతో విశేషమైన స్పందన వచ్చింది. అలాగే దీనిపై మరింత ప్రోత్సాహం ఉంటుందని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: నిర్మలా సీతారామన్ దెబ్బకు బంగారం ధర ఢమాల్.. మరీ ఇంతలానా..?

ఇవి కూడా చదవండి

బడ్జెట్ తర్వాత మన ప్రాజెక్ట్స్ సీఎండీ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ 2024 విజన్‌ని అందజేస్తుందని, పీఎం హౌసింగ్ స్కీమ్ కోసం రూ.10 లక్షల కోట్ల కేటాయింపు 1 గృహ అవసరాలను తీర్చడానికి ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. కోటి కుటుంబాలు, భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి $1 ట్రిలియన్‌కు చేరుకుంటుందని అంచనా వేశారు. పారిశ్రామిక కార్మికులకు అద్దె గృహాలపై దృష్టి పెట్టడం, 100 నగరాల్లో ‘ప్లగ్ అండ్ ప్లే’ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, 1 కోటి గృహాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను లక్ష్యంగా చేసుకుందని అన్నారు.

ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఎక్కడి నుంచో తెలుసా?

బడ్జెట్ ప్రకటనకు కొద్ది రోజుల ముందు జూలై 19న కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ పథకం కింద కాంపోనెంట్ ‘స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాల’ అమలు కోసం కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతకుముందు ఫిబ్రవరి 2024లో మధ్యంతర బడ్జెట్ తర్వాత సోలార్ రూఫ్‌టాప్ సామర్థ్యంలో వాటాను పెంచడానికి, నివాస గృహాలకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఈ పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

ఇది కూడా చదవండి: School Holiday: సంచలన నిర్ణయం.. వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి