PM Pension Yojana: కేంద్ర ప్రభుత్వ పెన్షన్ ప్లాన్.. ఏడాది లక్ష రూపాయలు.. వివరాలు ఇలా తెలుసుకోండి..

|

Jul 27, 2021 | 9:46 AM

Government Pension Scheme: దేశాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర సర్కార్ ప్రత్యేక పథకాలను తీసుకొస్తోంది. ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉంది.

PM Pension Yojana: కేంద్ర ప్రభుత్వ పెన్షన్ ప్లాన్.. ఏడాది లక్ష రూపాయలు.. వివరాలు ఇలా తెలుసుకోండి..
Pm Pension Yojana
Follow us on

దేశాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర సర్కార్ ప్రత్యేక పథకాలను తీసుకొస్తోంది. ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉంది. సీనియర్ సిటిజన్స్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని కొత్త పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లో చేరడం ద్వారా సంవత్సరానికి లక్ష రూపాయలకు పైగా పొందే అవకాశం లభిస్తుంది. ఈ ప్లాన్‌లో చేరడం ద్వారా సంవత్సరానికి 1,11,000 రూపాయలు పెన్షన్ రూపంలో పొందే అవకాశం ఉంది.

అయితే  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా పొందే పెన్షన్ ఆధారపడి ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడి మొత్తం ప్రాతిపదిక ఆధారంగా డబ్బులు మారే అవకాశం ఉంటుంది.

కనీసం నెలకు 1,000 రూపాయల నుంచి గరిష్టంగా 9,250 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్‌ కాలపరిమితి 10 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇందులో మరో అవకాశం కూడా ఉంది. ప్లాన్‌లో చేరినవారు లోన్ కూడా పొందేందుకు అవకాశం ఉంది. ఈ స్కీమ్‌లో చేరిన వారు మాత్రం 3 సంవత్సరాల తర్వాత లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది.

ఈ ప్లాన్‌లో చేరాలని అనుకున్నవారు బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌తో పాటు పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ అందించాలి. దీంతో ఈ స్కీమ్ లో సులభంగా చేరే అవకాశం ఉంది. 2023 సంవత్సరం మార్చి నెల వరకు ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:  Petrol Diesel Price: పట్టణవాసులకు గుడ్ న్యూస్.. స్థిరంగా పెట్రో ధరలు..ఏపీలో మాత్రం..

Rivers overflowing: తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల ఉరుకులు.. పరుగులు.. నిండుకుండలా ప్రాజెక్టులు

Nirai Mata Temple: ఈ అమ్మవారి ఆలయం ఏడాదిలో 5 గంటలే తెరిచి ఉంటుంది.. ఎక్కడో తెలుసా..

PNB: బ్యాంక్ లోన్ తిరిగి చెల్లించలేకపోయారా.. అయితే మీకు గుడ్ న్యూస్.. 25 నుంచి 75 శాతం రిబేటు