Aadhaar card : 5 సంవత్సరాల పిల్లలకు ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు ఈ విషయం కచ్చితంగా గుర్తుంచుకోండి..!

Aadhaar card : ఆధార్ కార్డు మీ కోసం మాత్రమే కాదు మీ పిల్లలకి కూడా చాలా ముఖ్యమైనది. మీ పిల్లల వయస్సు 5 సంవత్సరాల కన్నా

Aadhaar card : 5 సంవత్సరాల పిల్లలకు ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు ఈ విషయం కచ్చితంగా గుర్తుంచుకోండి..!
Aadhaar Card
Follow us
uppula Raju

|

Updated on: Jul 27, 2021 | 9:15 AM

Aadhaar card : ఆధార్ కార్డు మీ కోసం మాత్రమే కాదు మీ పిల్లలకి కూడా చాలా ముఖ్యమైనది. మీ పిల్లల వయస్సు 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే.. అతడికి మీరు ఆధార్ కార్డును తీసుకోవాలనుకుంటే ఈ విషయం కచ్చితంగా గుర్తుంచుకోండి. ఆధార్ జారీచేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) దీని గురించి సమాచారం ఇచ్చింది. ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారం తెలిపింది. ఆధార్ తయారుచేసే క్రమంలో వ్యక్తి కి సంబంధించి అనేక రకాల సమాచారం సేకరిస్తారు. బయోమెట్రిక్ సమాచారాన్ని కలిగి ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఆధార్ కార్డు తయారు చేయవచ్చు.

5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ తయారుచేసేటప్పుడు బయోమెట్రిక్ సేకరించడం లేదని యుఐడిఎఐ ట్వీట్ చేసింది. బయోమెట్రిక్ అంటే పిల్లల వేలిముద్ర, వారి ఐరిస్ స్కానింగ్ కలిగి ఉంటుంది. అయితే ఈ రెండిటిని 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సేకరించడం తప్పనిసరి. పిల్లల తల్లిదండ్రులే ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలకు ఫింగర్ స్కాన్ చేస్తారు. పిల్లల వయస్సు 5 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు వారి బయోమెట్రిక్ మళ్లీ అప్‌డేట్‌ చేస్తారు.

బాల్ ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? 1. దీని కోసం మొదట మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఈ వెబ్‌సైట్‌లో మీరు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

2. ఇక్కడ పిల్లల పేరు, తల్లిదండ్రుల పేరుతో సహా చాలా సమాచారం నింపాలి. ఆధార్ నమోదు ఫారమ్‌ను కూడా పూరించాలి.

3. ఈ దశలో మీరు నివాస చిరునామా, ప్రాంతం, జిల్లా / నగరం, రాష్ట్రం మొదలైన వివరాలను నింపుతారు.

4. అప్పుడు అపాయింట్‌మెంట్ బటన్ పై క్లిక్ చేసి ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ కోసం షెడ్యూల్ ఎంచుకోండి. మీరు మీ ఇంటికి దగ్గరగా ఉన్న నమోదు కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.

5. నియామక తేదీన మీరు నమోదు కేంద్రాన్ని సందర్శించాలి. ఇక్కడ మీరు పిల్లల జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఫోటోకాపీ, రిఫరెన్స్ నంబర్ కూడా తీసుకెళ్లాలి.

6. నమోదు కేంద్రంలో అన్ని పత్రాలు ధృవీకరిస్తారు. తరువాత బయోమెట్రిక్ సమాచారం పిల్లల ఆధార్ కార్డుతో అనుసంధానిస్తారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఫోటో మాత్రమే నమోదు చేస్తారు.

7. ఇక్కడ అన్ని ప్రక్రియలు పూర్తయిన తరువాత, దరఖాస్తుదారునికి రసీదు సంఖ్య ఇస్తారు. దీని సహాయంతో మీరు అప్లికేషన్ స్థితిని తెలుసుకోవచ్చు.

8. 60 రోజుల తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో ఎస్ఎంఎస్ అందుతుంది. నమోదు ప్రక్రియ జరిగిన 90 రోజుల్లో బాల్ ఆధార్ మీకు పంపిస్తారు.

Mount Everest : ఎవరెస్ట్ శిఖరంపై విమానం ఎందుకు ఎగరదు..! ‘నో ఫ్లై జోన్’లో ఉండటానికి కారణం ఏమిటి?

Ayurveda Curd: పెరుగు తినడం ఇష్టం లేదా.. మీరు ఎన్ని ఆరోగ్య ప్రయోజలు మిస్ అవుతున్నారో తెలుసా..!

Tokyo Olympics 2020: ప్రమోషన్‌తోపాటు రూ. 2 కోట్లు.. మీరాబాయి చానుకి బంపర్ ఆఫర్ ఇచ్చిన భారతీయ రైల్వే