PMUY : ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ కింద గ్యాస్‌ కనెక్షన్లు..! 5 కోట్ల మంది BPL మహిళలకు అవకాశం..

| Edited By: Ravi Kiran

Aug 09, 2021 | 8:52 AM

PMUY : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు10 న ఉజ్జ్వల యోజన రెండో దశను ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పేదరిక రేఖకు దిగువన ఉన్న మహిళలకు LPG కనెక్షన్లను పంపిణీ చేస్తారు.

PMUY : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్‌ కనెక్షన్లు..! 5 కోట్ల మంది BPL మహిళలకు అవకాశం..
Lpg Cylinder
Follow us on

PMUY : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు10 న ఉజ్జ్వల యోజన రెండో దశను ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పేదరిక రేఖకు దిగువన ఉన్న మహిళలకు LPG కనెక్షన్లను పంపిణీ చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా PMUY పథకం లబ్ధిదారులతో సంభాషిస్తారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) 2016 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ సమయంలో 5 కోట్ల BPL కుటుంబాలకు చెందిన మహిళలకు LPG కనెక్షన్‌లను అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం ఏప్రిల్ 2018 లో ఈ పథకం విస్తరించారు. మరో ఏడు వర్గాల వారికి (SC/ST, PMAY, AAY, అత్యంత వెనుకబడిన తరగతులు, టీ తోట, అటవీ నివాసులు, ద్వీపవాసులు) అవకాశం కల్పించారు. అలాగే దీని లక్ష్యం 8 కోట్ల LPG కనెక్షన్‌లకు సవరించారు. షెడ్యూల్ చేసిన తేదీకి ఏడు నెలల ముందుగానే అంటే 2019 ఆగస్టులో ఈ లక్ష్యం సాధించారు.

ఎవరు ఈ సదుపాయాన్ని పొందుతారు
ఉజ్వల 2.0 కింద ఉచిత LPG కనెక్షన్‌తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్‌ప్లేట్ అందిస్తారు. అలాగే దీనిలో నమోదు ప్రక్రియకు కనీస పత్రాలు అవసరం. ఉజ్వల 2.0 లో వలసదారులు రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. ప్రధాన మంత్రి కలను సాకారం చేయడానికి ఉజ్వల 2.0 సహాయపడుతుంది. 21-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌లో PMUY పథకం కింద ఒక కోటి అదనపు LPG కనెక్షన్లను కేంద్రం ప్రకటించింది. ఈ అదనపు కనెక్షన్లనుPMUY మొదటి దశ కింద కవర్ చేయలేని తక్కువ ఆదాయ కుటుంబాలకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Karthika Deepam: మీ అమ్మనూ చంపేస్తాను..నిస్సిగ్గుగా నిజాలు కక్కిన మోనిత..నిజాలు విని కార్తీక్ షాక్..!

చౌకైనా ఎలక్ట్రిక్‌ సైకిల్‌..! ఒక్కసారి చార్జ్‌ చేస్తే 75 నుంచి 100 కిలోమీటర్లు.. ధర ఎంతంటే..?

Landslide: వామ్మో.. భారీగా విరిగిపడిన కొండచరియలు.. ఒళ్లు గగుర్పొడుస్తున్న భయానక దృశ్యాలు