Loan Scheme: కేంద్రం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌లో రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు.. ఎలాంటి పత్రాలు అవసరం

|

Dec 25, 2022 | 7:45 AM

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక మీరు వ్యాపారం..

Loan Scheme: కేంద్రం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌లో రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు.. ఎలాంటి పత్రాలు అవసరం
LOAN
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక మీరు వ్యాపారం ప్రారంభించబోతున్నట్లయితే ఈ పథకం కింద సులభంగా రుణం పొందవచ్చు. ఈ పథకం ప్రధాన మంత్రి ముద్ర లోన్ కింద సులభంగా రుణాలు పొందవచ్చు. దీని కింద వ్యాపారులకు హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలు అందజేస్తోంది. అయితే ఈ లోన్ మొత్తాన్ని మూడు కేటగిరీల కింద తీసుకోవచ్చు.

ప్రధాన్ మంత్రి ముద్రా లోన్ యోజన కింద, శిశు, కిషోర్, తరుణ్ కేటగిరీల కింద రుణాలు తీసుకోవచ్చు. రుణం తీసుకోవడానికి మీరు బ్యాంకుకు దరఖాస్తు చేసుకుని దరఖాస్తుకు సరైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఏ పత్రాల సహాయంతో లోన్ తీసుకోవచ్చు, పథకం కింద ఎంత మొత్తంలో లోన్ అందుతుంది అనేదాని గురించి తెలుసుకోండి.

శిశు కేటగిరీలో ఎంత మొత్తం లభిస్తుంది?

ఇవి కూడా చదవండి

మీరు వ్యాపారం ప్రారంభిస్తున్నట్లయితే మీరు శిశు కేటగిరీ కింద రుణం తీసుకోవచ్చు. ఇందులో మీకు 50 వేల రూపాయల వరకు రుణం అందుకోవచ్చు. లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీకు 5 సంవత్సరాల సమయం ఇవ్వబడుతుంది. ఈ సమయంలో 10 శాతం నుండి 12 శాతం వరకు వడ్డీని వసూలు చేయవచ్చు.

కిషోర్ లోన్ మొత్తం:

మీరు ఇప్పటికే వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీరు ఈ పథకం కింద రూ. 50,000 నుండి రూ.5 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. రుణం ఇచ్చే సంస్థ ఈ మొత్తంపై విభిన్న వడ్డీని నిర్ణయిస్తుంది. దీనితో పాటు రుణ మొత్తాన్ని ఇచ్చే సమయంలో దరఖాస్తు, క్రెడిట్ రికార్డులను పరిశీలిస్తారు. రికార్డులు సరిగ్గా ఉంటే రుణం మంజూరు చేయబడుతుంది.

తరుణ్ లోన్ మొత్తం:

ఈ పథకం కింద వ్యాపారాన్ని స్థాపించినా, వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకునే వ్యక్తులకు అందిస్తారు. ఈ సందర్భంలో రుణం మొత్తం ఇవ్వబడుతుంది. ఇది రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ఉంటుంది. వడ్డీ రేటును రుణ సంస్థ నిర్ణయిస్తుంది.

ఏయే పత్రాలు అవసరం:

దరఖాస్తు ఫారం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, కేవైసీ పత్రం పత్రం, గుర్తింపు కార్డు, చిరునామా రుజువు, ఆదాయ రుజువు, పూర్తి వ్యాపార సంబంధిత వివరాలు, కార్యాలయ రుజువు, లైసెన్స్, రిజిస్ట్రేషన్ రుజువు మొదలైనవి ఇవ్వవలసి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి