ప్రధాని మోడీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దావణగెరెలో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు మోదీ. కాంగ్రెస్‌లో కార్యకర్తలకు విలువ లేదని, బీజేపీలో ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుందన్నారు. మోదీతో ఈ సభకు సీఎం బస్వారాజ్ బొమ్మై , మాజీ సీఎం యడియూరప్ప కూడా హాజరయ్యారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సొంత ఊరు కలబుర్గిలో జరిగిన మేయర్, డిప్యూటీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని అన్నారు మోడీ. కాంగ్రెస్ నేతలకు తనపై తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటని, కలబుర్గిలో బీజేపీ విజయం వెనుక మోడీ కుట్ర ఉందని తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉందన్నారు. కర్నాటకలో మరోసారి బీజేపీ విజయం సాధిస్తుందని, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు మోడీ.
అంతకుముందు కర్ణాటకలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. బెంగళూర్ మెట్రో రెండో దశను ప్రారంభించారు. రూ.4,249 కోట్ల వ్యయంతో నిర్మించిన 13.71 కిలోమీటర్ల దూరంతో 12 స్టేషన్లు గల మెట్రో లైన్‌ను ప్రారంభించారు. అలా గే మెట్రోలో కార్మికులతో కలిసి ప్రయాణం చేశారు. మెట్రోలో ప్రయాణించి బెంగళూరు మెట్రో రైలు సిబ్బంది, మెట్రో నిర్మాణ కార్మికులు, విద్యార్థులతో సహా వివిధ వర్గాల ప్రజలతో సంభాషించారు మోడీ. అయితే ప్రధానమంత్రి టికెట్ కౌంటర్ వరకు నడిచి ఆపై మెట్రో రైలు ఎక్కేందుకు సాధారణ ప్రయాణీకుడిలాగానే ప్రవేశ ద్వారం గుండా వెళ్లారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి