PM Kisan Yojana: జూలై 27న విడుదలయ్యే పీఎం కిసాన్ డబ్బులు వీరికి మాత్రం రావు.. ఎందుకో తెలుసా..?
రైతుల 14వ విడత కోసం నిరీక్షణకు తెరపడనుంది. ఎందుకంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడతను జూలై 27న రైతుల ఖాతాకు బదిలీ చేస్తారు. రాజస్థాన్‌లోని సికార్ నుంచి ప్రధాని మోదీ దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలకు సుమారు రూ.17,000 కోట్లను బదిలీ..
రైతుల 14వ విడత కోసం నిరీక్షణకు తెరపడనుంది. ఎందుకంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడతను జూలై 27న రైతుల ఖాతాకు బదిలీ చేస్తారు. రాజస్థాన్‌లోని సికార్ నుంచి ప్రధాని మోదీ దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలకు సుమారు రూ.17,000 కోట్లను బదిలీ చేయనున్నారు. విశేషమేమిటంటే, ఇప్పటి వరకు 13వ విడత పీఎం కిసాన్ యోజన కింద విడుదలైంది. రైతుల ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా 6 వేల రూపాయలు ఇస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా అందజేస్తారు. ఈ వాయిదాను నాలుగు నెలల వ్యవధిలో ఇస్తారు. జులై 27న విడుదల కానున్న 14వ విడతలో కొంత మంది రైతులకు రూ.2వేలు వాయిదాలు అందే అవకాశం లేదు.
14వ విడత మొత్తాన్ని ఎవరెవరికి రావు..?
భూమికి సంబంధించిన పాస్‌బుక్ వివరాలను ధృవీకరించాలని ప్రభుత్వం కోరింది. ఈ రికార్డు తప్పు అని తేలితే, ఈ జాబితా నుంచి లబ్ధిదారులు తొలగిస్తారు. అంతే కాకుండా ఈ-కేవైసీ చేయని రైతులకు ఈ విడత ఇవ్వరు. మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో పనిచేస్తున్నప్పటికీ ఈ మొత్తం ఇవ్వబడదు. దీంతో పాటు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఈ మొత్తం అందవని గుర్తించుకోవాలి.
ఈ వెబ్‌సైట్ ద్వారా మీ పేరు చెక్ చేసుకోండి
పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి మీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తనిఖీ చేసుకోవచ్చు. మీకు అర్హత ఉంటే జాబితాలో మీ పేరు కనిపిస్తుంది. మీకు అర్హత లేకపోతే మీ పేరు కనిపించదు.
సమస్య పరిష్కారం కోసం..
మీరు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు pmkisan-ict@gov.in లో సంప్రదించవచ్చు . ఇది కాకుండా పీఎం కిసాన్ యోజన- 155261 లేదా 1800115526 లేదా 011-23381092 హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా సంప్రదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి