PM Kisan 13th Installment: పీఎం కిసాన్‌ రైతులకు గుడ్‌న్యూస్‌.. 13వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

|

Dec 02, 2022 | 6:52 PM

 మోడీ ప్రభుత్వం రైతులకు కొత్త కొత్త పథకాలను రూపొందిస్తోంది. కేంద్ర ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ ఒకటి. మీరు కూడా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారు అయితే ఈ వార్త..

PM Kisan 13th Installment: పీఎం కిసాన్‌ రైతులకు గుడ్‌న్యూస్‌.. 13వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
Pm Kisan Update
Follow us on

మోడీ ప్రభుత్వం రైతులకు కొత్త కొత్త పథకాలను రూపొందిస్తోంది. కేంద్ర ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ ఒకటి. మీరు కూడా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారు అయితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. పీఎం కిసాన్ 12వ విడత నిధులను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు 12వ విడతగా రైతుల ఖాతాలో 2000 రూపాయలు రాగా, ఇంకా రాని వారికి వారి ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. దీని తర్వాత ఇప్పుడు 13వ విడతను విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఒకటి. ఈ పథకానికి సంబంధించి ప్రధాని మోదీ స్వయంగా అనేక వేదికల నుండి రైతుల ప్రయోజనాల గురించి మాట్లాడారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ రైతుల కోసం ట్వీట్ చేస్తూ, ‘దేశం మన రైతు సోదర సోదరీమణులను చూసి గర్విస్తోంది. అవి ఎంత బలంగా ఉంటే నవ భారతదేశం అంత సుసంపన్నం అవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, వ్యవసాయానికి సంబంధించిన ఇతర పథకాలు దేశంలోని కోట్లాది మంది రైతులకు కొత్త బలాన్ని అందిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

13వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి?

పీఎం కిసాన్ తదుపరి విడత త్వరలో రాబోతోంది. వాస్తవానికి ఈ పథకం కింద రైతులకు సంవత్సరం మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు అందుతుంది. రెండవ విడత ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు అందుతుంది. అదే సమయంలో మూడవ విడత డబ్బు డిసెంబర్ 1 – మార్చి 31 మధ్య రైతుల ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. దీని ప్రకారం.. డిసెంబర్‌ 20న రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 13వ విడత జమ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానిని త్వరగా పరిష్కారం పొందవచ్చు. దీని కోసం మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ ఐడిలో మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు.
పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092ను సంప్రదించవచ్చు. మీరు మీ ఫిర్యాదును ఇ-మెయిల్ ID ( pmkisan-ict@gov.in )లో కూడా మెయిల్ చేయవచ్చు. అలాగే మీరు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోకుంటే pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నమోదు చేసుకోండి. అలాగే పీఎం కిసాన్‌ డబ్బులు పొందుతున్న రైతులు ఇ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ లేకపోతే 13వ విడత డబ్బులు అందవని గుర్తించుకోవాలి.

ఇవి కూడా చదవండి

మీ వాయిదా స్థితిని ఇలా తనిఖీ చేయాలి?

➦ ఇన్‌స్టాల్‌మెంట్ స్థితిని చూడటానికి మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.

➦ ఇప్పుడు ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయండి.

➦ ఇప్పుడు బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

➦ అప్పుడు కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

➦ ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

➦ దీని తర్వాత మీరు మీ స్థితి గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి