Farmers: రైతులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.6 వేలు.. దరఖాస్తు చేస్కోండి..

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్ధిక సాయం అందించేందుకు పీఎం కిసాన్ అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతీ ఏడాది రూ.6 వేలు అందిస్తోంది. 5 ఎకరాల్లోపు పోలం ఉన్నవారు దీనిక అర్హులు. ఆన్‌లైన్‌లోనూ దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Farmers: రైతులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.6 వేలు.. దరఖాస్తు చేస్కోండి..
pm kisan

Updated on: May 05, 2026 | 7:50 AM

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ యోజన పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. దీని ద్వారా దేశంలోని కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ప్రతీ ఏడాది రూ.6 వేలను ఈ పథకం ద్వారా రైతులకు మోదీ ప్రభుత్వం అందిస్తోంది. వీటిని రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున జమ చేస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా బటన్ నొక్కి ఈ నగదును విడుదల చేస్తు్న్నారు. ఇటీవల 22వ విడతను విడుదల చేయగా.. 23వ విడతను ఆగస్టులో విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటివరకు రూ.4.25 లక్షల కోట్లు అందించారు. మీకు అర్హత ఉంటే పీఎం కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? దీని ప్రాసెస్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.

అర్హతలు..

-భారత పౌరులై ఉండాలి

-మీ పేరుపై వ్యవసాయ భూమి కలిగి ఉండాలి

-5 ఎకరాల్లోపు మాత్రమే పోలం ఉండాలి

-రేషన్ కార్డు కలిగి ఉండాలి

వీళ్లు అనర్హులు

-ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ సభ్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు

-ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు

-నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ పింఛన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు

-ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు

-ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు

-2019 తర్వాత భూమి కొనుగోలు చేసినవారు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

-పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.gov.in ఓపెన్ చేయండి

-ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ఎంచుకోండి

-న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి

-ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి

-వివరాలు ఎంటర్ చేశాక అవును అనే ఆప్షన్ ఎంచుకోండి

-పీఎం కిసాన్ దరఖాస్తుల ఫారం నింపి సేవ్ చేయండి

-వివరాలు అన్నీ ఇచ్చాక సబ్మిట్ చేయండి

-అప్లికేషన్ అవసరమైతే ప్రింటవుట్ తీసుకోండి

-మీరు దరఖాస్తు చేసుకున్నాక రిఫరెన్స్ నెంబర్ ఆధారంగా ఈ వెబ్ సైట్లోనే స్టేటస్ తెలుసుకోవచ్చు

-అధికారులు పరిశీలించాక మిమ్మల్ని అర్హుల జాబితాలో చేర్చుతారు.

కావాల్సిన డాక్యుమెంట్స్

దరఖాస్తు చేసుకునేందుకు మీ పట్టాదారు పాస్ పుస్తకం, రేషన్ కార్డు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ అవసరం. ఇక మండల కేంద్రానికి వెళ్లి ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యవసాయ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక సీఎస్‌సీ సెంటర్ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశముందని చెప్పవచ్చు.

Follow Us