PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‏న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే…

|

May 19, 2021 | 3:09 PM

PM Kisan Samman Nidhi 2021: కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలను తీసుకువచ్చింది.

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‏న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే...
Pm Kisan
Follow us on

PM Kisan Samman Nidhi 2021: కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలను తీసుకువచ్చింది. వీటి ద్వారా అన్నదాతలకు ఆర్థికంగా ఊరట కల్పిస్తోంది. అయితే ఇందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు విడతల వారిగా డబ్బులు జమచేయనుంది. అయితే ఇప్పటికే 7 విడతల వారిగా డబ్బులు అకౌంట్లోకి జమ అయ్యాయి. ఇక మోదీ ప్రభుత్వం ఇటీవలే రూ. 2 వేలను రైతుల అకౌంట్లోకి జమ చేసిన సంగతి తెలిసిందే.

ఈ పీఎం కిసాన్ స్కీమ్‏లో చేరిన రైతులకు కేంద్రం మరో బెనిఫిట్ కూడా అందిస్తోంది. అదే చౌక వడ్డీకి రుణాలను పొందోచ్చు. పీఎం కిసాన్ రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులు సులభంగానే తీసుకోవచ్చు. ఈ కేసీసీ కార్డు ఉన్నవారు బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీకే లోన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. గతేడాది పీఎం కిసాన్ స్కీమ్‏ను కిసాన్ క్రెడిట్ కార్డును లింక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. దీంతో ఈ పథకంలో ఉన్న ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు లభిస్తుంది. అలాగే ఈ కేసీసీ కార్డు ఉన్నవారు బ్యాంక్ నుంచి రూ. 3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఇలాంటి రుణాలపై వడ్డీ కూడా కేవలం 4 శాతంగానే ఉంటుంది. రుణాలపై వడ్డీ రేటు 9 శాతంగానే ఉంటుంది. అయితే ఇందులో ప్రభుత్వం నుంచి 2 శాతం సబ్సిడీ ఇస్తుంది. దీంతో వడ్డీ రేటు 7 శాతానికి తగ్గుతుంది. అలాగే రైతులు గడువులోగా లోన్ మొత్తాన్ని చెల్లిస్తే మరో 3 శాతం తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ఈ తరహా లోన్ తీసుకున్న వారికి 4 శాతం వడ్డీ ఉంటుంది. ఇక ఈ లోన్ కోసం అప్లై చేసుకోవాలన్న.. లేదా కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలన్న మీ బ్రాంచ్ బ్యాంకుకు వెళ్లి చేసుకోవచ్చు.

Also Read: ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇక డెబిట్ కార్డ్ అక్కర్లేదు.. మొబైల్‏తోనే డబ్బులు విత్ డ్రా..

కరోనా కష్టాల్లో కేంద్రం గుడ్‏న్యూస్.. అకౌంట్లోకి ఉచితంగా రూ.50 వేలు.. సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే చాలు..