PM Kisan: రైతులకు శుభవార్త… మీ అకౌంట్లోకి రూ.2000 వచ్చేది ఆరోజునే.. మరీ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకున్నారా ?

| Edited By: Team Veegam

May 06, 2021 | 8:10 PM

PM Kisan: కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు తీసుకువచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన.

PM Kisan: రైతులకు శుభవార్త... మీ అకౌంట్లోకి రూ.2000 వచ్చేది ఆరోజునే.. మరీ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకున్నారా ?
Pm Kisan
Follow us on

PM Kisan: కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు తీసుకువచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతుల అకౌంట్లోకి నేరుగా డబ్బును జమచేస్తోంది. ఇందులో చేరిన వారికి మాత్రమే తమ బ్యాంక్ ఖాతాలోకి నగదు జమవుతుంది. అయితే అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6 వేలు లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో వస్తాయి. అంటే రూ. 2 వేలు చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమవుతున్నాయి. ఇప్పటికే ఈ పథకంలో చాలా మంది రైతులు చేరారు. PM Kisan Samman Nidhi Yojana

సాధారణంగా పీఎం కిసాన్ సమ్మన్ నిధి కింద మొదటి విడత రూ. 2000 ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, మూడవ విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు వస్తుంది. అయితే ఇప్పటివరకు చాలా మంది రైతులు ఈ పథకంలో భాగంగా నగదు అందుకున్నారు. ఇక ఇదే సమయంలో కొంతమంది అర్హత లేని రైతులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ఈసారి కేంద్రం ఈ స్కీం నిబంధనలలో అనేక మార్పులు చేసింది. పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ప్రభుత్వ ప్రజాదరణ పొందిన పథకాల్లో ఒకటి. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏటా రూ .6 వేలు అందిస్తుంది. ఈ డబ్బును నేరుగా రైతుల ఖాతాకు పంపుతారు. చిన్న, అట్టడుగు రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రధాని కిసాన్ సమ్మన్ నిధిని మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి 4 నెలలకు రూ .2,000 రైతుల ఖాతాకు బదిలీ అవుతుంది. ఇప్పటివరకు 7 విడతలు రైతుల ఖాతాలో జమయ్యాయి. ఇక 8 వ విడత డబ్బులు త్వరలోనే రైతుల ఖాతాల్లోకి రానున్నాయి. మే 10లోగా రూ.2 వేల పీఎం కిసాన్ సమ్మాన్ కోసం రిజిస్టర్ చేసుకున్న రైతుల అకౌంట్లలో పడనున్నాయి. అయితే డబ్బులు రావడానికి ముందుగా పీఎం కిసాన్ వెబ్ సైట్ లో మీ పేరు రిజిస్టర్ అయ్యిందా లేదా అనేది ముందుగానే చెక్ చేసుకోవాలి. బెనిఫీసియరీ లిస్ట్ (అర్హుల జాబితా)లో పేరున్న వారికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు వస్తాయి. మరీ మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా..

మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలంటే..

1. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmksan.gov.in/ ను సందర్శించాలి.
2. ఆ తర్వాత మీక ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే బెనిఫీసియరీ లిస్ట్ పై క్లిక్ చేయాలి.
3. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

Also Read: విక్రమ్ వేదకు ఏమైంది…? అడ్డంకులను దాటి రీమేక్ అయ్యేదెప్పుడు ? చిరు, నాగ్ కాంబో వచ్చేనా..

కోవిడ్‌ పేషెంట్లకు పూర్తి ఉచిత వైద్య సేవలు.. అసవరమైన బెడ్లను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన..! 30 రైళ్లు తాత్కాలికంగా రద్దు..