PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు అలర్ట్.. రూ.2 వేలు అకౌంట్లో పడకపోతే ఇలా చేయండి.. మీ ప్రాబ్లం క్లియర్..
కేంద్ర ప్రభుత్వం గత నెల 30వ తేదీన పీఎం కిసాన్ నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఇవి ఇప్పటికే రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. అయితే కొంతమందికి ఇంకా నగదు అందకపోవడంతో టెన్షన్‌కు గురవుతున్నాయి. అలాంటివారు ఏం చేయాలంటే..

కేంద్ర ప్రభుత్వం గత నెలలో పీఎం కిసాన్ నిధులను రైతుల అకౌంట్లలో జమ చేసిన విషయం తెలిసిందే. 24వ విడత నగదును అక్టోబర్ 30వ తేదీన రిలీజ్ చేసింది. గుజరాత్‌లో జరిగిన కార్యక్రమంలో లబ్దిదారుల అకౌంట్లలోకి రూ.2 వేల చొప్పున ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. దీపావళికి ముందే తమ అకౌంట్లలో నగదు జమ కావడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. అయితే కొంతమంది ఈ డబ్బులు ఇంకా అకౌంట్లలో జమ కాలేదు. దీంతో అలాంటివారు ఆందోళన పడుతున్నారు. విడుదల చేసి 10 రోజులు దాటినా డబ్బులు అందకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. కొన్ని కారణాల వల్ల నగదు నిలిచిపోవచ్చు. దీంతో కారణమేంటనేది తెలుసుకుని పరిష్కరించుకుంటే మీ సమస్య తొలగిపోతుంది. వెంటనే మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశముంటుంది.
కారణాలు ఇవే..
-కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ లబ్దిదారులకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. నిజమైన లబ్దిదారులకే నగదు అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. కేవైసీ పెండింగ్‌లో ఉంటే నగదు నిలిచిపోతాయి. దీని వల్ల మీ అకౌంట్లో జమ కావు. ఇలాంటివారు కామన్ సర్వీసెస్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోవాలి. పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. మీ ఆధార్, మొబైల్, పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది.
-పీఎం కిసాన్ పోర్టల్‌లో ల్యాండ్ సీడింగ్ జరిగి ఉండాలి. మీ భూమి ధృవీకరణ పూర్తి కాకపోతే మీ మండలంలోని వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించండి. మీ పత్రాలను తనిఖీ చేసి పోర్టల్‌లో భూమి ధృవీకరణను అప్డేట్ చేసుకోండి
-బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలి. ఒకవేళ అనుసంధానం చేయకపోతే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పెండింగ్‌లో ఉంటుంది. ఈ బ్యాంక్ శాఖను సంప్రదించి ఇది పూర్తి చేసుకోండి ఎన్‌పీసీఐ ఆప్షన్ యాక్టివ్ చేసుకోండి.
డబ్బులు అందకపోతే ఏం చేయాలి..?
మీరు పై పనులన్నీ పూర్తి చేసిన తర్వాత కూడా డబ్బులు అందకపోతే పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్‌ను సంప్రదించండి. 011-24300606 నెంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా పీఎం కిసాన్ గ్రీవెన్స్ ఎంక్వైరీ ఫామ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. పీఎం రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయడం ద్వారా పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం గ్రీవెన్స్ పోర్టల్ ఓపెన్ చేయండి. అనంతర మీ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి. మీ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేసి ఫిర్యాదు చేయండి..
