PM Kisan: పీఎం కిసాన్ మీకు అందలేదా..? డోంట్ వర్రీ.. ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే..

కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం పీఎం కిసాన్ 22వ విడత నగదును రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. దీంతో లబ్దిదారులకు రూ.2 వేలు అందాయి. అయితే కొన్ని సమస్యల వల్ల కొంతమంది లబ్దిదారులకు డబ్బులు అందలేదు. వీళ్లు ఫిర్యాదు చేయవచ్చు.

PM Kisan: పీఎం కిసాన్ మీకు అందలేదా..? డోంట్ వర్రీ.. ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే..
Pm Kisan

Updated on: Mar 15, 2026 | 11:29 AM

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 13వ తేదీన పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అస్సాంలోని గువహతిలో జరిగిన కార్యక్రమంలో నిధులను విడుదల చేశారు. దీంతో లబ్దిదారుల అకౌంట్లలో రూ.2 వేలు జమ అయ్యాయి. దాదాపు 22వ విడత క్రింద రూ.18,640 కోట్లను కేంద్రం రిలీజ్ చేసింది. సుమారు 9 కోట్ల 32 లక్షల మంది రైతులకు ఈ విడతలో రూ.2 వేల చొప్పున అందించారు. అయితే మీ పేరు లబ్దిదారుల జాబితాలో ఉండి డబ్బులు అకౌంట్లో పడకపోతే ఫిర్యాదు చేసే అవకాశం కేంద్రం కల్పిస్తోంది. ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం.

టోల్ ఫ్రీ నెంబర్ ఇదే..

పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉండి డబ్బులు పొందేందుకు అర్హత ఉన్నా మీకు అందలేదా..? అయిడే డోంట్ వర్రీ. మీరు ఈమెయిల్, టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నెంబర్లను తీసుకొచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన హెల్ప్‌లైన్ నంబర్లు 155261, 1800115526 లేదా 011-23381092 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.pmkisan-ict@gov.inకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీకు ఎందుకు అందలేదు అనే సమాచారం తెలుసుకోవచ్చు. ఆ కారణం తెలుసుకుని సమస్యను పరిష్కరించుకుంటే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి.

ఎందుకు పడలేదంటే..?

ఈకేవైసీ అప్డేట్ చేయకపోతే డబ్బులు నిలిచిపోతాయి. ప్రతీ ఏడాదిలో ఒకసారి పీఎం కిసాన్ వెబ్ సైట్లోకి వెళ్లి ఈకేవైసీ అప్డేట్ చేయాలి. ఇలా చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశముంది. ఇక ఈకేవైసీ, బ్యాంక్ అకౌంట్లో ఏమైనా లోపాలు ఉన్నా నిలిచిపోవచ్చు. ఇక మీ బ్యాంక్ అకౌంట్‌ను ఈకేవైసీ, ఆధార్‌తో లింక్ చేయకపోవడం వల్లన నిధులు నిలిచిపోతాయి. ఇక ల్యాండ్ రికార్డుల్లో తప్పులు ఉండటం వల్ల కూడా పీఎం కిసాన్ జమ కావు. కాగా ఇప్పటివరకు మొత్తం రూ.4.09 లక్షల కోట్లను ఈ పథకం ద్వారా రైతులకు కేంద్రం అందించింది. కాగా ఈ పథకం ద్వారా కేంద్రం ప్రతీ ఏడాది చిన్న, సన్నకారు రైతులకు రూ.6 వేల చొప్పున ఆర్దిక సాయం అందిస్తోంది. మూడు విడతలుగా వీటిని జమ చేస్తోంది. 5 ఎకరాల్లోపు పోలం ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్కువ పోలం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. కొంతమంది అనర్హుల పేర్లను కేంద్రం ఇటీవల లబ్దిదారుల జాబితా నుంచి తొలగించింది. పీఎం కిసాన్ వెబ్‌సైట్లోకి వెళ్లి ఈ పథకం కింద అర్హత పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Follow Us