PM Kisan: పీఎం కిసాన్‌ 21వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

PM Kisan: జమ్మూ కాశ్మీర్‌లోని రైతులు ఇప్పటికే తమ వాయిదాలను అందుకున్నారు. అక్టోబర్ 7న, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 8.55 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.171 కోట్లను బదిలీ చేశారు. వీరిలో..

PM Kisan: పీఎం కిసాన్‌ 21వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

Updated on: Nov 04, 2025 | 2:27 PM

PM Kisan: దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురు చూసేది పీఎం కిసాన్‌ స్కీమ్‌ గురించి. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత త్వరలో రైతుల ఖాతాలకు జమ కానుంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇప్పటికే సహాయ నిధులను రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. ఓ మూడు రాష్ట్రాల్లో పీఎం కిసాన్‌ నిధులను జమ చేసింది కేంద్రం. ఎందుకంటే వరదల కారణంగా ముందస్తుగా రైతులకు ఈ పీఎం డబ్బులను అందజేసింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలోని రైతులు PM కిసాన్ పథకం కింద 21వ విడత రూ. 2,000 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పీఎం కిసాన్ తదుపరి విడత ఎప్పుడు వస్తుంది?

నివేదికల ప్రకారం.. ప్రభుత్వం నవంబర్ 5వ తేదీన లేదా నవంబర్ మొదటి వారంలో రూ.2,000 తదుపరి విడతను విడుదల చేయవచ్చు. అయితే, ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. ఈసారి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలలోని రైతులకు ముందస్తు వాయిదాలను జారీ చేసింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సుమారు 2.7 మిలియన్ల మంది రైతుల ఖాతాలకు ఇప్పటికే రూ. 2,000 మొత్తాన్ని బదిలీ చేశారు. ఇటీవలి వరదల కారణంగా ఈ రాష్ట్రాలలోని రైతులు గణనీయమైన నష్టాలను చవిచూశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ముందస్తు వాయిదాను ఉపశమనంగా పంపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ పని చేయకుంటే సిలిండర్‌పై సబ్సిడీ నిలిచిపోతుంది?

అదనంగా జమ్మూ కాశ్మీర్‌లోని రైతులు ఇప్పటికే తమ వాయిదాలను అందుకున్నారు. అక్టోబర్ 7న, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 8.55 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.171 కోట్లను బదిలీ చేశారు. వీరిలో 85,000 మంది మహిళా రైతులు ఉన్నారు. ఇప్పటివరకు, ఈ పథకం కింద జమ్మూ కాశ్మీర్‌లోని రైతులకు మొత్తం రూ.4,052 కోట్లు పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండి: Smartphones: 2030 నాటికి స్మార్ట్‌ఫోన్‌లు కనుమరుగవుతాయా? ఎలన్ మస్క్ షాకింగ్ న్యూస్‌ వెల్లడి

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ఇప్పటివరకు 20 వాయిదాలను విడుదల చేసింది. 2019లో ప్రారంభించబడిన ఈ పథకం రైతులకు ఏటా రూ.6,000 అందిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా పంపిణీ చేస్తారు. ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 సమాన వాయిదాలలో రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడం ప్రధానమంత్రి కిసాన్ యోజన లక్ష్యం. తద్వారా వారు తమ వ్యవసాయ ఖర్చులను నిర్వహించుకోవచ్చు. లక్షలాది మంది రైతులకు ఉపశమనం కలిగించే ప్రధానమంత్రి కిసాన్ యోజన 21వ విడతను విడుదల చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు సన్నాహాలు చేస్తోంది.

Maruti Cars: రూ.10 లక్షల లోపు 5 బెస్ట్‌ మారుతి కార్లు.. అద్భుతమైన మైలేజీ, ఫీచర్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి