AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Great Indian Festival Sale: వాషింగ్ మెషిన్లపై వారెవ్వా అనే ఆఫర్లు.. ఏకంగా 34శాతం తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవి..

మీరు వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనే ప్లాన్లో ఉన్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ప్రస్తుతం అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలో ఈ వాషింగ్ మెషిన్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. తక్కువ ధరలో టాప్ బ్రాండ్ అయిన శామ్సంగ్ వాషింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. ఏకంగా 34శాతం వరకూ తగ్గింపుపై ఇవి లభిస్తున్నాయి. పైగా అదనంగా పలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ చేంజ్ బోనస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Amazon Great Indian Festival Sale: వాషింగ్ మెషిన్లపై వారెవ్వా అనే ఆఫర్లు.. ఏకంగా 34శాతం తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవి..
Washing Machine
Madhu
|

Updated on: Oct 27, 2023 | 6:05 PM

Share

మీరు వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనే ప్లాన్లో ఉన్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ప్రస్తుతం అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. దీనిలో ఈ వాషింగ్ మెషిన్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. తక్కువ ధరలో టాప్ బ్రాండ్ అయిన శామ్సంగ్ వాషింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. ఏకంగా 34శాతం వరకూ తగ్గింపుపై ఇవి లభిస్తున్నాయి. పైగా అదనంగా పలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ చేంజ్ బోనస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్న శామ్సంగ్ 7కేజీ వాషింగ్ మిషన్లు, వాటిపై ఆఫర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శామ్సంగ్ హైజీన్ స్టీమ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్.. దీనిపై అమెజాన్లో 32% తగ్గింపు లభిస్తోంది. దీనిలో 12 వాష్ సైకిల్స్ అందుబాటులో ఉంటాయి. క్విక్ వాష్, బెడ్డింగ్, కాటన్, కలర్స్, డైలీ వాష్, డ్రైన్/స్పిన్, డ్రమ్ క్లీన్, ఇ కాటన్, హైజీన్ స్టీమ్, రిన్స్ + స్పిన్, సింథటిక్స్ వంటివి అందుబాటులో ఉంటాయి. 1200 ఆర్పీఎం వద్ద అధిక స్పిన్ వేగం మీ బట్టలు వేగంగా ఆరబెట్టడంలో మీకు సహాయం చేస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ డైమండ్ డ్రమ్ మీ శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్‌ను మన్నికైనదిగా, దీర్ఘకాలం ఉండేలా చేస్తుంది. దీని ధర రూ. 27,490గా ఉంది.

శామ్సంగ్ 7కేజీ ఫుల్లీ-ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్.. దీనిపై అమెజాన్ లో మీకు 20% తగ్గింపు లభిస్తోంది. మీది 3-4 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండే కుటుంబం అయితే ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. 700 ఆర్పీఎంతో అధిక స్పిన్ స్పీడ్‌ని కలిగి ఉండటంతో, ఇవి మీకు బట్టలను త్వరగా ఆరబెట్టడాన్ని సాహాయం చేస్తుంది. డిజిటల్ ఇన్వర్టర్ సాంకేతికతతో ఇది వస్తుంది. దీని ధర రూ. 17,980గా ఉంది.

ఇవి కూడా చదవండి

శామ్సంగ్ 7 కేజీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్.. దీనిపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో 19% తగ్గింపు లభిస్తోంది. ఇది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ అయినందున, మీరు డ్రైయింగ్ ప్రయోజనాల కోసం ఒక కంపార్ట్‌మెంట్ నుంచి మరొక కంపార్ట్‌మెంట్‌కు బట్టలు మార్చడానికి కొద్దిగా మాన్యువల్ పనిని చేయాల్సి ఉంటుంది. 700ఆర్పీఎంతో స్పిన్ వేగాన్ని కలిగి ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ డైమండ్ డ్రమ్ మీ బట్టలపై చాలా సున్నితంగా ఉంటుంది. దీనిని కేవలం రూ. 10,990కే కొనుగోలు చేయొచ్చు.

శామ్సంగ్ ఏఐ నియంత్రణ ఫుల్లీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్.. ఇది 5స్టార్ రేటింగ్ తో వచ్చే వాషింగ్ మెషిన్ ఇది. దీనిపై ఏకంగా 34శాతం తగ్గింపు లభిస్తుంది. ఏఐ నియంత్రణతో మీ లాండ్రీని సులభంగా, సమర్థవంతంగా చేస్తుంది. ఇది పాత విధానాల ఆధారంగా పని చేయడం, ఒకసారి కమాండ్ ఇస్తే ఆటోమేటిక్ దానిని అవలంభించడం చేస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 31,990గా ఉంది.

శామ్సంగ్ 7కేజీ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్.. దీనిపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023లో 26% తగ్గింపు లభిస్తోంది. నార్మల్, క్విక్ వాష్, సోక్+నార్మల్, డెలికేట్స్, ఎకో టబ్ క్లీన్, ఎనర్జీ సేవింగ్ వంటి వివిధ వాషింగ్ ప్రోగ్రామ్‌లతో వస్తోంది. డ్రమ్ డైమండ్ కట్, మృదువైన కర్ల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది మీ దుస్తులను జాగ్రత్తగా ఉతికి ఆరేస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ ధర రూ. 15,490గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..