Fact Check: రూ.30 వేల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే బ్యాంకు ఖాతా మూసివేస్తారా? ఆర్బీఐ నిబంధనలు ఏంటి?
మీ బ్యాంకు ఖాతాలో 30 వేల రూపాయల కంటే ఎక్కువ జమ అయ్యిందా? అప్పుడు మీ బ్యాంక్ ఖాతా మూసివేయబడుతుంది.. తాజాగా అలాంటి సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమాచారం నిజమేనా? సహజంగానే ఈ సందేశం..
మీ బ్యాంకు ఖాతాలో 30 వేల రూపాయల కంటే ఎక్కువ జమ అయ్యిందా? అప్పుడు మీ బ్యాంక్ ఖాతా మూసివేయబడుతుంది.. తాజాగా అలాంటి సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమాచారం నిజమేనా? సహజంగానే ఈ సందేశం వైరల్‌గా మారడంతో సామాన్యుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ మార్గదర్శకాలు నిజంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోండి.
వైరల్ సందేశం ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కొత్త ప్రకటన చేశారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ 30 వేల రూపాయల కంటే ఎక్కువ ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది. ఈ సమాచారం పూర్తిగా తప్పు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి ప్రకటన చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టం చేసింది.
ఈ మేరకు పీఐబీ ట్వీట్ చేసింది. రూ. 30,000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు మూసివేయబడతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఇటీవల ప్రకటించారు. ఈ వార్త పూర్తిగా ఫేక్. ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
एक ख़बर में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक के गवर्नर ने बैंक खातों को लेकर एक अहम ऐलान किया है कि अगर किसी भी खाताधारक के खाते में 30,000 रुपये से ज्यादा है तो उसका खाता बंद कर दिया जाएगा#PIBFactCheck
▪️ यह ख़बर #फ़र्ज़ी है।
▪️ @RBI ने ऐसा कोई निर्णय नहीं लिया है। pic.twitter.com/dZxdb5tOU9
— PIB Fact Check (@PIBFactCheck) June 15, 2023
ఇలాంటి వార్తలు ఏవైనా వైరల్ అవుతుంటే పీఐబీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వార్తల ప్రామాణికతను తనిఖీ చేయవచ్చు. దీని కోసం మీరు పీఐబీ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు. అలాగే మరో వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఏదైనా వార్త ప్రామాణికతను కూడా తనిఖీ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి