యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..! ఆ పేమెంట్ యాప్ వాడుతున్నారా.. అయితే చెల్లించాల్సిందే..

|

Oct 22, 2021 | 5:15 PM

Payment App: కరోనా వల్ల చాలామంది డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. ఇందుకోసం అందరు స్మార్ట్ ఫోన్స్‌ని ఉపయోగించి గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటిఎం, అమెజాన్

యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..! ఆ పేమెంట్ యాప్ వాడుతున్నారా.. అయితే చెల్లించాల్సిందే..
Phonepe
Follow us on

Payment App: కరోనా వల్ల చాలామంది డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. ఇందుకోసం అందరు స్మార్ట్ ఫోన్స్‌ని ఉపయోగించి గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటిఎం, అమెజాన్ పే వంటి పేమెంట్ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. అయితే ఈ ట్రాన్జాక్షన్స్‌ అన్నీ ఉచితంగా జరిగేవే అయితే తాజాగా ఫోన్‌ పే యాప్ మరో సంచలనానికి తెరదీసింది. లావాదేవీలపై డబ్బులు చార్జ్ చేయడం ప్రారంభించింది. దీంతో ఫోన్‌ పే యూజర్లందరు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

కొంతమంది వినియోగదారుల నుంచి మొబైల్ రీఛార్జ్ కోసం రూ.1 నుంచి 2 వరకు ప్లాట్‌ఫారమ్ ఫీజును వసూలు చేస్తుంది. రూ.50 నుంచి రూ.100 రీచార్జ్‌ చేసుకుంటే ఒక్క రూపాయి, రూ.100 కంటే ఎక్కువ రీచార్జ్‌ చేసుకుంటే రూ.2 వసూలు చేస్తుంది. ఇంతకాలం యూజర్లకు ఉచితంగా సేవలందించిన ఫోన్‌ పే ఖర్చులు తగ్గించుకోవడానికి చార్జీలను వసూలు చేస్తుంది.

ఇదిలా ఉంటే శుక్రవారం ఫోన్ పే.. ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్‌లపై రూ.50 వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఫోన్‌పే యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు రూ .51 కంటే ఎక్కువ మూడు ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్‌లను పూర్తి చేసిన తర్వాత క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకుంటారని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ పొందడానికి వినియోగదారులు ఫోన్‌పే యాప్‌ని ఓపెన్ చేసి, మొబైల్ రీఛార్జ్‌లపై క్లిక్ చేయాలి. నంబర్‌ను ఎంచుకొని ప్లాన్ ఆధారంగా రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

PhonePe 325 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. ఈ యాప్‌ ద్వారా డబ్బు పంపవచ్చు స్వీకరించవచ్చు, మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జ్ చేయవచ్చు. యుటిలిటీ చెల్లింపులు చేయవచ్చు. బంగారం కొనుగోలు చేయవచ్చు పెట్టుబడులు కూడా పెట్టవచ్చు. ఫోన్‌పే 2017 లో ఆర్థిక సేవల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

ACB Raids: మాజీ సీఎం సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు..

Sweet Potato: ఈ 4 వ్యాధులను దూరం చేసే దివ్య ఔషధం.. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు.!

Toothpaste: టూత్‌ పేస్ట్‌తో పెద్ద ముప్పు..! పిల్లలకు తొందరగా ఎఫెక్ట్.. జాగ్రత్త..