EPF withdraw: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా.. ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువ. అయితే ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా అందించేందుకు ఈపీఎఫ్ఓ ద్వారా ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుంది. అయితే ఆర్థిక అత్యవసర సమయాల్లో ఉద్యోగులు పీఎఫ్ తీసుకునేందుకు వెసులబాటు ఉంటుంది. తాజాగా ఈపీఎఫ్ఓ యూపీఐ ద్వారా సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

EPF withdraw: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా.. ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం
Epf

Updated on: Feb 21, 2025 | 3:03 PM

ఈపీఎఫ్ఓ ద్వారా వేగవంతంగా నిధుల బదిలీలను లక్ష్యంగా పెట్టుకున్నందున ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులు త్వరలో యునైటెడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) క్లెయిమ్స్‌ను ఉపసంహరించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని, రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో యూపీఐ ప్లాట్‌ఫారమ్స్‌లో ఈ ఫీచర్ ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 7.4 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నఈపీఎఫ్ఓకు యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. 

ఈపీఎఫ్‌ను యూపీఐకు లింక్ చేయడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక లావాదేవీలను సరళీకృతం అవుతాయి. వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్‌తో పాటు ఒకసారి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత క్లెయిమ్ మొత్తాలను సబ్ స్కైబర్లు డిజిటల్ వాలెట్ల ద్వారా సులభంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గిస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని వినియోగదారులు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాణిజ్య బ్యాంకులతో కలిసి కార్మిక మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన డిజిటల్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇలాంటి చర్యలు ఉపసంహరణ ప్రక్రియను సులభతరం చేస్తున్నాయి. 

ముఖ్యంగా పేపర్ పని లేకుండా ఆన్‌లైన్ ద్వారానే ఈపీఎఫ్ఓ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత ఆరు-ఏడు నెలల్లో పెన్షన్ సేవలను మెరుగుపరచడానికి దాని సమాచార సాంకేతిక (ఐటీ) వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయడానికి, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) క్లెయిమ్‌ల కోసం సజావుగా క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను నిర్ధారించడానికి ఈపీఎఫ్ఓ అనేక సంస్కరణలను అమలు చేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ 50 మిలియన్లకు పైగా చందాదారులు క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసింది. ఇది ఇప్పటివరకు అత్యధిక సెటిల్మెంట్‌ అని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఈపీఎఫ్ఓ రూ.2.05 లక్షల కోట్లకు పైగా చందాదారులకు అందించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈఫీఎఫ్ఓ 44.5 మిలియన్ల క్లెయిమ్ సెటిల్మెంట్ల ద్వారా మొత్తం రూ.1.82 లక్షల కోట్లను చందాదారులకు అందించింది.  మూడు రోజుల్లోపు ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లు 2024 ఆర్థిక సంవత్సరంలో 8.95 మిలియన్ల నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి 18.7 మిలియన్లకు పెరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి