Petrol Diesel Price Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పరుగులు పెట్టనున్నాయా..?.. తాజా రేట్ల వివరాలు

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి..

Petrol Diesel Price Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పరుగులు పెట్టనున్నాయా..?.. తాజా రేట్ల వివరాలు

Updated on: Jul 02, 2022 | 9:36 AM

Petrol Diesel Price Today: ప్రభుత్వ చమురు కంపెనీలు శనివారం జూలై 2, 2022 పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. నేటికీ చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోలు-డీజిల్‌పై ఎలాంటి మార్పు లేకపోవడంతో వాహనదారులకు కొంత ఊరటనిస్తుందనే చెప్పాలి. మే 21న పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మే 22న దేశవ్యాప్తంగా చమురు ధరల్లో చివరి మార్పు జరిగింది. మే 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు .

ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35 కాగా, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు. అదే సమయంలో కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. అలాగే హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.82గా ఉంది.

అయితే పెట్రోల్, డీజిల్, ATF పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. లీటర్‌ పెట్రోల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపై రూ.6, లీటర్‌ డీజిల్‌పై రూ.13 ఎగుమతి పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

SMS ద్వారా మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను తనిఖీ చేయండి

మీరు SMS ద్వారా మీ నగరంలో ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. దీని కోసం, ఇండియన్ ఆయిల్ (IOCL) వినియోగదారులకు RSP కోడ్ రాసి 9224992249 నంబర్‌కు పంపండి. మీ నగరం RSP కోడ్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ఆధారంగా, చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి.

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి