దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోన్నాయి. వరుసగా 12వ రోజు మంగళవారం కూడా ఇంధన ధరలు యథాతథంగా కొనసాగాయి. అంతకుముందు నవంబర్ 4న, ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు రూ. ₹ 103.97లుగా ఉంది. డీజిల్ ధర రూ. 86.67గా ఉంది. ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ. 109.98 ఉండగా డీజిల్ రూ. 94.14 గా ఉంది. మెట్రో నగరాల్లో ముంబైలో ఇంధన ధరలు అత్యధికంగా ఉన్నాయి. విలువ ఆధారిత పన్ను లేదా VAT కారణంగా రాష్ట్రాలలో రేట్లు మారుతూ ఉంటాయి.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40 ఉండగా.. డీజిల్ రూ.91.43గా ఉంది. కోల్కత్తాలో పెట్రోల్ రూ.104.67, డీజిల్ రూ.89.79గా ఉంది.
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వరంగ చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు చేస్తే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఐరోపాలో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ 0.1 శాతం పడిపోయి బ్యారెల్‌కు 81.96 డాలర్లకు చేరుకోగా, U.S. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 0.1 శాతం పడిపోయి బ్యారెల్ 80.78 డాలర్లకు పడిపోయింది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.09గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.84గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.22గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.88పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.31గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.23కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.31లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.57 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.66గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.71లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.72గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.87గా ఉండగా.. డీజిల్ ధర రూ.96గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.23 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.31లకు లభిస్తోంది.
Read Also.. Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?