Fuel Price Today: బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మెట్రో నగరాల్లో రికార్డు స్థాయిలో..

|

Oct 27, 2021 | 8:07 AM

Latest Petrol Diesel Prices: రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా

Fuel Price Today: బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మెట్రో నగరాల్లో రికార్డు స్థాయిలో..
Fuel Price
Follow us on

Latest Petrol Diesel Prices: రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా మండిపోతుండంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా బుధవారం ధరలను మరోసారి పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతున్న ధరలను తగ్గించాలని వాహనదారులు కోరుతున్నప్పటికీ.. పెరగడం మాత్రం ఆగడం లేదు. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు బుధవారం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి.

తాజాగా పెరిగిన ధరలతో.. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.107.94, డీజిల్‌ ధర రూ.96.67 కి పెరిగింది.
ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.113.80, డీజిల్‌ రూ.104.75 కి చేరింది.
చెన్నైలో పెట్రోల్‌ రూ.104.83 కి చేరగా.. డీజిల్‌ రూ.100.92కి పెరిగింది.
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.108.46 కి పెరగగా.. డీజిల్‌ రూ.99.78 కి చేరింది.
హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 36 పైసలు పెరగగా.. డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.112.27 కి చేరగా.. డీజిల్‌ ధర రూ.105.46కి పెరిగింది.
ఏపీలోని విజయవాడలో పెట్రోల్ ధర 114.48కి చేరగా.. డీజిల్ ధర 107కి ఎగబాకింది.

దేశీయ పెట్రోలియం సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తాయి. దీని ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మారి అమలులోకి వస్తాయి.

Also Read:

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో..

Silver Price Today: వెండి ధరలకు బ్రేక్.. తటస్థంగానే రేట్లు.. ప్రధాన నగరాల్లో..