Petrol Diesel Offer Price: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌తో పోటీ పడుతున్న డీజిల్.. మీ నగరంలో ధరలు ఎలా ఉందో తెలుసా..

|

Nov 22, 2021 | 8:50 AM

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హెచ్చ..తగ్గులు ఉన్నాయి.

Petrol Diesel Offer Price: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌తో పోటీ పడుతున్న డీజిల్.. మీ నగరంలో ధరలు ఎలా ఉందో తెలుసా..
Petrol Diesel Prices
Follow us on

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హెచ్చ..తగ్గులు ఉన్నాయి. సోమవారం  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ధరల్లో ప్రభావం కనిపించింది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.07గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.69గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.38గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.72గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.36కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.45లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.46 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.59గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.65లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.74గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.76గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.82గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.36 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.45లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.

ఇవి కూడా చదవండి: Kinnera player Mogilaiah: ఆర్టీసీ బస్సు తల్లిలాంటిది.. మొగులయ్య పాటను షేర్ చేసిన సజ్జనార్..

PNB: ఆ బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌.. కస్టమర్ల ఐడీ, పాస్‌వర్డ్‌ లీక్..