Petrol Diesel Price Today: స్టైల్ మార్చుకోని పెట్రోల్… నేనేం తక్కువ కాదంటున్న డీజిల్..

|

Jun 14, 2021 | 8:23 AM

Petrol Diesel Price Today:   పెట్రోల్, డీజిల్ ధరలో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి.  రోజు రోజుకు భారంగా మారుతున్న పెట్రో ధరలతో రవాణా రంగం కుంటి నడక నడుస్తోంది. ఎక్కడో ఉన్న పెట్రో ధరలు ఇప్పుడు కొండెక్కి...

Petrol Diesel Price Today: స్టైల్ మార్చుకోని పెట్రోల్... నేనేం తక్కువ కాదంటున్న డీజిల్..
Petrol Price Today
Follow us on

Petrol-Diesel Rates Today:  పెట్రోల్, డీజిల్ ధరలో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి.  రోజు రోజుకు భారంగా మారుతున్న పెట్రో ధరలతో రవాణా రంగం కుంటి నడక నడుస్తోంది. ఎక్కడో ఉన్న పెట్రో ధరలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. సోమవారం  నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.20 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 95.14గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.07 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.01గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 100.25గా ఉండగా.. డీజిల్ ధర రూ. 95.17గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.20గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.07గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.30ఉండగా.. డీజిల్ ధర రూ.95.30 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.60పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 94.70గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 102.66కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 95.41 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 101.35 ఉండగా.. డీజిల్ ధర రూ.95.41గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.91లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.41 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.44 గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.53గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 102.66 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.97.05 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 96.49గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 87.28 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.58కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.70 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.96.34 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 90.12 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 97.69ఉండగా.. డీజిల్ ధర రూ.91.92గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.63 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.92.53 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.40 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.47గా ఉంది.

ఇవి కూడా చదవండి: IRCTC Latest News: ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్ ట్రైన్లు.. తిరిగి ప్రారంభమవుతున్న రైళ్లు ఇవే..

SBI Customer Alart: ఇలా చేస్తే మీరు ఇబ్బందులు పడాల్సిందే.. మరోసారి ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ..!