Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి..? తాజా రేట్ల వివరాలు

|

Sep 27, 2022 | 10:02 AM

Today Petrol Diesel Price: వాహనదారుల నడ్డి విరిచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. గతంలో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.120 వరకు పరుగులు..

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి..? తాజా రేట్ల వివరాలు
Petrol Diesel Price Today
Follow us on

Today Petrol Diesel Price: వాహనదారుల నడ్డి విరిచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. గతంలో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.120 వరకు పరుగులు పెట్టగా, కేంద్ర ప్రభుత్వం తగ్గింపుతో పది రూపాయల మేర దిగి వచ్చింది. సెప్టెంబర్‌ 27న దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62 ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.35 ఉండగా, పెట్రోల్‌ ధర రూ.94.28 ఉఎంది. కోల్‌కతాలో రూ.106.03 ఉండగా, డీజిల్‌ ధర రూ.92.76 ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.63 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.24 ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.82 ఉంది.

పెట్రోల్‌, డీజిల్ ధరలను చెక్‌ చేసుకోండిలా..

మీకు రోజువారీగా పెట్రోల్‌,డీజిల్‌ ధరలు తెలుసుకోవాలంటే మీరు ఇంట్లో కూర్చోని కూడా ధరలను చెక్‌ చేసుకోవచ్చు. మొబైల్‌లో ఎస్‌ఎంఎస్‌ ద్వారా, ఆన్‌లైన్‌ ద్వారా ధరల వివరాలను తెలుసుకోవచ్చు. రోజువారీగా ధరలను చెక్‌ చేసుకునేందుకు ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారు RSP<డీలర్ కోడ్> అని రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. అదే సమయంలో, HPCL వినియోగదారులు 9222201122 నంబర్‌కు HPPRICE <డీలర్ కోడ్> అని టైప్ చేయడం ద్వారా, అలాగే BPCL (BPCL) వినియోగదారులు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేయడం చేసి 9223112222కు SMS పంపండి. ధరలను తెలుసుకునేందుకు ఈ లింక్‌ ద్వారా కోడ్‌ను తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మే 22 తేదీన ఆర్థిక మంత్రి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలో చివరి మార్పు జరిగింది. మే 21వ తేదీన లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన తర్వాత ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధరపై రూ.8.69, డీజిల్ ధరపై రూ.7.05 తగ్గింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఒక విషయం ఏంటంటే.. రాష్ట్రాల్లో ఉండే పన్నును బట్టి చమురు ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి తప్ప పెద్దగా ఏమి ఉండదు.

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. లేకపోతే మరిన్ని ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేది. గతంలో వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడే రోజులు ఉండేవి. సామాన్యుడిపై ఈ ధరల ప్రభావం తీవ్రంగా ఉండేది. ముందే నిత్యవసర సరుకుల నుంచి అన్నింటి ధరలు పెరిగిపోతుండటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సామాన్యులు.

పెట్రోల్ పై ఎంత పన్ను విధిస్తారు?

రాజధాని ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉంది. ఇందులో బేస్ ధర రూ.57.13. లీటరుకు 20 పైసలు ధర. ఎక్సైజ్ సుంకం రూ.19.90, వ్యాట్ లీటరుకు రూ.15.71. డీలర్ కమీషన్ లీటరుకు రూ.3.78. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పన్ను రేటు 15 జూన్ 2022 ఆధారంగా ఉంటుంది.

డీజిల్‌పై పన్ను ఎంత?

మరోవైపు రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. దీని మూల ధర లీటరుకు రూ.57.92. లీటరు ధర రూ.0.22, ఎక్సైజ్ డ్యూటీ రూ.15.80, వ్యాట్ రూ.13.11. డీలర్ కమీషన్ లీటరుకు రూ.2.57. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పన్ను రేటు 15 జూన్ 2022 ఆధారంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి