Petrol-Diesel Price Today: ఉత్తరప్రదేశ్‌తో సహా దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol,Diesel Rate) భారీగా పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ – రష్యా (Ukraine-Russia) మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ధరలు భారీగా మండిపోనున్నాయి. ఇక గత ఏడాది నవంబర్ నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రష్యా – ఉక్రెయిన్ యుద్ధాలు ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వాస్తవానికి ఉక్రెయిన్-రష్యా యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్ (International Markets)లో ముడి చమురు ధరలు 110 అమెరికన్ డాలర్లను దాటాయి. గత రెండు నెలల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ రిటైలర్లు ఆ ధరను రికవరీ చేసేందుకు ధరలను అమాంతంగా పెంచేశారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. గత ఏడాది నవంబర్ ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నిలిచిపోయినప్పుడు.. ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు $ 81.5గా ఉంది. ఇండియన్ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అప్‌డేట్స్ ప్రకారం.. దేశీయంగా మార్చి 5న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 ఉండగా, డీజిల్ ధర రూ.86.67గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98 ఉండగా, డీజిల్ ధర రూ.94.14గా ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా, డీజిల్ ధర రూ. 91.43గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.67 ఉండగా, డీజిల్ ధర రూ.89.79 ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20 ఉండగా, డీజిల్ ధర రూ. 94.62వద్ద కొనసాగుతోంది.
ఇక పెట్రోల్, డీజిల్ ధరలను కూడా SMS ద్వారా తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నుంచి 9224992249 నెంబర్‌కు SMS పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్ (Message) పపితే ధరల వివరాలు వస్తాయి.