Petrol diesel price today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు మే 26, గురువారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు మే 26, గురువారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత వారం శనివారం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత మే 22 ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.7 నుంచి రూ.9.50కి తగ్గింది. ఈరోజు రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ఢిల్లీతో పాటు ముంబైలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.111.35, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. కాగా, కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.92.76గా ఉంది. దేశంలోని 4 మహానగరాల్లో ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరలను పోల్చి చూస్తే, రాజధాని ఢిల్లీలో చమురు ధరలు అత్యల్పంగా ఉండగా, ముంబైలో ఎక్కువగా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం నుంచి దేశంలోని సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 115 డాలర్లకు చేరుకున్నాయి. గురువారం, మే 25, WTI క్రూడ్ ధరలు దాదాపు $111, బ్రెంట్ క్రూడ్ ధరలు $115 వద్ద ట్రేడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 97.82గా ఉంది. విజయవాడలో పెట్రోల్ లీటర్‌కు రూ.109 డీజిల్‌కు 97.82గా ఉంది.