Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్ ధరలకు అడ్డు పడేలా కనిపించట్లేదు. రికార్డు స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనం బయటకు తీయాలంటే భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇక చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా డీజిల్ ధరలు కూడా పెట్రోల్ ధరలకు చేరువవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓవైపు ప్రతిపక్షాలు, ప్రజలు చమురు ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా ధరలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ఇంధన ధరలు పెరగడం ఇది వరుసగా 12వ రోజు కావడం గమనార్హం. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూసేయండి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.19 ఉండగా (శుక్రవారం రూ.89.88), డీజిల్ రూ.80.60 (శుక్రవారం రూ.80.27) వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధానిలో ఇంధన ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.96.62 ఉండగా (శుక్రవారం రూ.96.32), డీజిల్ రూ.87.67 (శుక్రవారం రూ.87.32)గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.93.78 వద్ద ఉండగా (శుక్రవారం రూ.93.45), డీజిల్ రూ. 87.91 (శుక్రవారం రూ.87.55) వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో మరో ప్రముఖ పట్టణమైన కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.93.90 ఉండగా (శుక్రవారం రూ.93.33), డీజిల్ రూ.88.01 (శుక్రవారం రూ.87.42) వద్ద కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.44 గా (శుక్రవారం రూ.96.16) ఉండగా డీజిల్ రూ.90.03 (శుక్రవారం రూ.89.69)గా నమోదైంది. సాగర నగరం విశాఖలో లీటర్ పెట్రోల్ రూ. 95.36 (శుక్రవారం రూ.95.18) ఉండగా, డీజిల్ రూ.88.98 ( శుక్రవారం రూ.88.76) వద్ద కొనసాగుతోంది.
Also Read: Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ .411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..