Petrol, Diesel Rates Today: నిలకడగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

Petrol Diesel Prices Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరిసారిగా ఏప్రిల్ 6వ తేదీన చమురు ధరలు పెంచారు...

Petrol, Diesel Rates Today: నిలకడగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 12, 2022 | 6:51 AM

Petrol Diesel Prices Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరిసారిగా ఏప్రిల్ 6వ తేదీన చమురు ధరలు పెంచారు. అయితే ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌ రూ.100 పైన ఉండడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు అధికంగా ఉండడంతో పరోక్షంగా రవాణాపై పడుతోంది. ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీలు పెంచగా, క్యాబ్‌లు కూడా ఛార్జీలు పెచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు పెట్రోల్ ధర రూ.105.41గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.67గా ఉంది. కాగా ఈరోజు ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51, డీజిల్ ధర రూ.104.77గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 115.12 కాగా డీజిల్ ధర లీటరుకు రూ. 99.83. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 110.85, లీటర్ డీజిల్ ధర రూ. 100.94 వద్ద కొనసాగుతోంది.

నగరం            పెట్రోల్         డీజిల్‌

ఢిల్లీ                  105.41         96.67

ముంబై            120.51         104.77

చెన్నై              110.85         100.94

కోల్‌కతా          115.12           99.83

లక్నో              105.25          96.83

జైపూర్            118.03         100.92

పాట్నా           116.23          101.06

జమ్మూ          106.52           90.26

రాంచీ           108.71          102.02

క్రూడాయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి ఒకవైపు దేశవ్యాప్తంగా 36 రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు నిలకడగా ఉండగా, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల్లో నిరంతర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈరోజు ముడి చమురు ధర బ్యారెల్‌కు 106.3 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గురువారం, మే 12, WTI క్రూడ్ ధరలు సుమారు $103.8 మరియు బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు $106.3.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. * హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు రాలేదు. లీటర్ పెట్రోల్‌ ధర రూ. 119.49 గా ఉండగా, డీజిల్ రూ. 105.49 వద్ద కొనసాగుతోంది.

* కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 119.18 గా నమోదుకాగా, డీజిల్‌ రూ. 105.19 గా ఉంది.

* విజయవాడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 121.60 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 107.18 గా ఉంది.

* విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 120.26 కాగా, డీజిల్‌ రూ. 105.89 వద్ద కొనసాగుతోంది.