Petrol Rate Today: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల కొన్ని చోట్ల మాత్రం పెరుగుదల.

|

Aug 30, 2021 | 9:44 AM

Petrol Rate Today: గత కొన్ని రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా స్వల్పంగా ధరలు తగ్గడంతో...

Petrol Rate Today: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల కొన్ని చోట్ల మాత్రం పెరుగుదల.
Follow us on

Petrol Rate Today: గత కొన్ని రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా స్వల్పంగా ధరలు తగ్గడంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం కూడా లభించింది. ఇక తాజాగా సోమవారం కూడా దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో పెద్దగా మార్పుల కనిపిచంలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల మాత్రం పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా ఈరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.49 గా ఉండగా, డీజిల్‌ రూ. 88.92 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.52 కాగా, డీజిల్‌ రూ. 96.48 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 99.20 గా ఉండగా, డీజిల్‌ రూ. 93.52 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటకల రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 104.98 కాగా, డీజిల్‌ రూ. 94.34 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ. 105.54 గా ఉండగా, డీజిల్‌ రూ. 96.99 గా ఉంది.
* ఆదిలాబాద్‌లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 108.18 (ఆదివారం రూ. 107.71)గా ఉండగా, డీజిల్‌ రూ. 99.45 (ఆదివారం రూ. 99.01)గా ఉంది.
* విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.67 గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 98.62 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 106.73 కాగా, డీజిల్‌ రూ. 97.70 గా నమోదైంది.

Also Read: Pakistan for Taliban: తాలిబన్ల రాజ్యం కోసం పాకిస్తాన్ ప్రపంచ యాత్ర.. ప్రత్యామ్నాయంగా ఎదిగిపోవాలనే విశ్వ ప్రయత్నాలు!

Viral Video: చిరుతను వెంటాడిన కోతుల మంద.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంటే!

Krishnashtami 2021: శ్రీకృష్ణతత్త్వం.. మానవాళికి విజయమంత్రం.. అర్ధం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది..