వాహనదారులకు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి చమురు ధరలు. అసలే కరోనా కష్టకాలంలో.. ఈ పెట్రోల్ ధరలు మరింత భారంగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా 14వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా శనివారం పెట్రోల్ ధర లీటరుకు 51 పైసలు పెరుగగా, డీజిల్‌పై 61 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.88కి చేరగా, లీటర్ డీజిల్ ధర రూ.77.67కు ఎగబాకింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు 12 వారాల షట్‌డౌన్ అనంతరం చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రజలకు ఈ పెరిగిన పెట్రోల్ ధరలతో మరింత ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్న నేపథ్యంలో ఆయిల్ ధరలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా స్థానిక పన్నుల్లో వ్యత్యాసాలు వల్లే ఆయా చోట్లలో ధరల్లో మార్పు ఉంటుందని చమురు కంపెనీలు చెబుతున్నాయి. కాగా ఇక జూన్ 9 నుంచి పెట్రోల్ ధరపై రూ.5.88, డీజిల్‌పై 6.50 పైసలు పెరిగింది.
ప్రముఖ నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు:
– హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ.81.88, డీజిల్ రూ.75.91
– అమరావతిలో పెట్రోల్ లీటర్ రూ.82.18, డీజిల్ రూ.77.67
– న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.78.88, డీజిల్ రూ.75.19
– ముంబైలో పెట్రోల్ లీటర్ రూ.85.70, డీజిల్ రూ.76.11