Petrol and Diesel Price: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయేమో అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఫిబ్రవరి నెల మధ్య వరకూ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ (రూ.100) దిశగాకొట్టడం ఖాయం అని అంతా అనుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 100 రూపాయలు దాటినప్పటికీ.. చాలా రాష్ట్రాల్లో 95, 96, 97 రూపాయల చొప్పున ఉంది. ఇదిలాఉంటే.. ఆదివారం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిలకడగా ఉన్న ధరలు.. ఎన్నికల తర్వాత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.56 ఉండగా, డీజిల్ ధర రూ.80.89 ఉంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.77 ఉండగా, డీజిల్ ధర రూ.83.75 ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.98 ఉండగా, డీజిల్ ధర రూ.87.96 ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.58 ఉండగా, డీజిల్ ధర రూ.85.58 ఉంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.93.59 ఉండగా, డీజిల్ ధర రూ.85.75 ఉంది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.16 ఉండగా, డీజిల్ ధర రూ.88.20 ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.04 ఉండగా, డీజిల్ ధర రూ.88.08 ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.74 ఉండగా, డీజిల్ ధర రూ.87.80 ఉంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.84 ఉండగా, డీజిల్ ధర రూ.90.32 ఉంది.
విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.52 ఉండగా, డీజిల్ ధర రూ.89.06 ఉంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా, డీజిల్ ధర రూ.90.18 ఉంది.
Gold Price Today: బంగారం ధరలకు బ్రేక్.. ఈ రోజు ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Top Smartmobiles: ఏప్రిల్ నెలలో భారత్‌లో విడుదల కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!
Royal Enfield Bike: బంపర్ ఆఫర్.. కేవలం రూ.50 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్.. ఏ మోడల్ అంటే.