Petrol Price on July 30: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

|

Jul 30, 2023 | 8:37 AM

ప్రతి రోజు చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవరిస్తుంటాయి. ప్రస్తుతం ఆయా నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండటం లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆయా ప్రాంతాల జీఎస్టీని బట్టి రేట్లలో స్వల్ప మార్పులు ఉంటున్నాయి. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ కావాలన్నా వంద రూపాయలకుపైగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని నెలలుగా, ముడి చమురు బ్యారెల్‌కు $70 నుండి $82కి చేరుకుంది. అయితే వరుసగా మూడు రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి..

Petrol Price on July 30: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
Petrol Price On July 30
Follow us on

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని నెలలుగా, ముడి చమురు బ్యారెల్‌కు $70 నుండి $82కి చేరుకుంది. అయితే వరుసగా మూడు రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. క్రూడాయిల్ కూడా 84 డాలర్లు దాటింది. దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ఆధారంగా మాత్రమే నిర్ణయించబడతాయి.

జూలై 30న దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. జూలై 30న అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 84.99 డాలర్లుగా ఉంది. డబ్ల్యూటీఐ ముడి చమురు బ్యారెల్ రూ.80.58గా ఉంది. ఉంది అయితే ఆయా నగరాలను జీఎస్టీని బట్టి కూడా ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని గమనించాలి.

పెద్ద నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర ఎంత?

  • కోల్‌కతా- పెట్రోల్ రూ.106.03, డీజిల్ లీటరు రూ.92.76.
  • బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ. 87.89.
  • ముంబై- పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27.
  • చెన్నై- పెట్రోలు రూ.102.63, డీజిల్‌ రూ.94.24.
  • న్యూఢిల్లీ – పెట్రోల్ రూ. 96.72, డీజిల్ రూ. 89.62.
  • హైదరాబాద్‌ – పెట్రోల్‌ రూ.109.66, డీజిల్‌ రూ.97.82

మీ నగరంలో ఇంధన ధరలను తెలుసుకోవడం ఎలా?

ప్రతిరోజూ మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఇంట్లో కూర్చొని ఒక SMS మాత్రమే పంపాలి. దీని కోసం BPCL వినియోగదారులు <డీలర్ కోడ్> అని టైప్ చేయడం ద్వారా 9223112222కు సందేశం పంపవచ్చు. మరోవైపు, ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేయడం ద్వారా 9224992249కి, HPCL కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్> అని 9222201122కు మెసేజ్ చేయడం ద్వారా తాజా ధరలను తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి