Petrol And Diesel Rates: నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ ప్రభావం పెట్రో ధరలపై పడింది. దీంతో పెట్రోల్, డీజిల్ రోజువారీ వడ్డింపు ఆగిపోయింది. భారత్‌లో మాత్రం పెట్రో ధరలు పెరగడకుండా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కూడా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ధరల్లో తగ్గుదల కూడా కనిపించింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.78 (సోమవారం 90.78) ఉండగా.. డీజిల్ ధర రూ.81.10(సోమవారం 81.10) వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.19గా(సోమవారం 97.19) ఉండగా డీజిల్ రూ. 88.20గా (సోమవారం)ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరులోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 93.32గాఉండగా.. డీజిల్ ధర రూ. 85.99 వద్ద కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.77గా ఉండగా.. డీజిల్ ధర రూ. 86.10గా ఉంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.39(సోమవారం 94.39)గా ఉండగా.. డీజిల్ రూ. 88.45 (సోమవారం 88.45)వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో మరో ముఖ్యమైన పట్టణమైన కరీంనగర్‌లోనూ ధరల విషయంలో స్వల్ప మార్పు కనిపించింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 94.51(సోమవారం 94.27)గా ఉండగా.. డీజిల్ ధర రూ. 88.56 (సోమవారం 88.33)గా నమోదైంది. విజయవాడలో ధరల్లో కొద్దిగా పెరిగాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 97.43 (సోమవారం రూ.97.10) కాగా డీజిల్ ధర రూ. 90.92గా(సోమవారం 90.60) నమోదైంది… సాగర నగరం విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 96.09 (సోమవారం రూ.95.74) గా డీజిల్ ధర రూ. 89.62(సోమవారం 89.31)గా నమోదైంది.ఉంది.